Extra - Ordinary Man Teaser: బాహుబలి సినిమాలో నితిన్.. ఏ క్యారెక్టర్‌లో కనిపించాడో తెలుసా?

జయం సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన హీరో నితిన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. 2002లో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. దాదాపు 20 ఏళ్ల నుంచి హీరోగానే కొనసాగుతూ వస్తున్నాడు. అయితే కొంత కాలంగా నితిన్ చేసిన సినిమాలు అన్నీ ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా 2020లో వచ్చిన భీష్మ సినిమా తర్వాత నుంచి ఆయన చేసిన ఏ ఒక్క సినిమా హిట్టుగా నిలవలేదు.

అలాగే చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాలు అన్ని డిజాస్టర్లుగా నిలిచాయి. ఈక్రమంలోనే తర్వాత వచ్చే సినిమాతో కచ్చితంగా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు నితిన్. ఆ కసితోనే డైరెక్టర్ వక్కంతం వంశీతో కలిసి ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్‌ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ పక్క మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల అయింది. అక్టోబర్ 30వ తేదీన విడుదల అయిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Hero Nithin Extra - Ordinary Man Movie Teaser Released

బాహుబలి సినిమాలో నితిన్: ముఖ్యంగా ఈ టీజర్ లో నితిన్ తనను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చెప్పుకుంటూ కనిపించాడు. ప్రోమోలో ముందుగా నితిన్ ను హీరోలా చూపించారు. ఇక ఆ తర్వాత అసలు నీ బ్యాగ్రౌండ్ ఏంటని అడగ్గా... నితిన్ రూపాలను చూపిస్తారు. ఈక్రమంలోనే హీరోయిన్ శ్రీలీల.. నితిన్ ను నువ్వు కొబ్బరి మట్ట సినిమాలో ఉన్నావు కదా అంటూ అడగడం అందరినీ ఆకట్టుకుంటోంది. వీరిద్దరి మధ్య సాగే ప్రేమాయణం అలాగే రొమాన్స్ ను కూడా కాసేపు చూపించారు. ఇక ఆ తర్వాత నితిన్ బాహుబలి సినిమా చూశావా అంటూ విలన్ ను అడగ్గా.. నాలుగు సార్లు చూశానని అతడు చెబుతాడు.

దండాలయ్యా, ఉండాలయ్యా సాంగ్ లో ఆరో లైన్ లో ఏడో వాడని చూశావా అని నితిన్ ప్రశ్నించగా... అక్కడ నితిన్ కనిపిస్తాడు. ఈ టీజర్ కు ఇదొక్కటే హైలెట్ గా నిలిచింది. ఆ తర్వతా నితిన్ ఐ యామ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పగా అందరూ ఆశ్చర్యపోతారు. దీని తర్వాత నితిన్ తండ్రి అరేయ్.. నవ్వొక జూనియర్ ఆర్టిస్ట్ వి. అంటే ఎక్స్ ట్రా గాడివి అని అంటూ తిడతాడు. ఫేస్ ప్యాక్ వేసుకొని కుర్చీపై కూర్చున్న నితన్ మాత్రం.. అలా వేరువేరుగా చెప్పే బదులు మింగిల్ చేసి చెప్తే ఎక్స్‌ట్రా - ఆర్డినరీ అవుతానుగా అంటూ చెప్పడం కూడా నవ్విస్తోంది.

Hero Nithin Extra - Ordinary Man Movie Teaser Released

ఈక్రమంలోనే నితిన్ తండ్రి.. చెత్త, నా కొడుకు.. చెత్త నా కొడుకు అంటూ చెత్తబుట్టని తన్నుతాడు. దీంతో టీజర్ పూర్తవుతుంది. అయితే ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ సహకారంతో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా అయినా హిట్టుగా నిలిచి నితిన్ కెరియర్ గ్రాఫ్ ను లేపుతుందా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X