Salaar Leaked Pic: సలార్ మూవీ నుంచి మరో లీక్.. భయపెడుతోన్న ప్రభాస్
ప్రభాస్.. కొంత కాలంగా తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో ఇదొకటి. అంతలా మనోడు పాన్ ఇండియాపై దండయాత్ర చేస్తూ దూసుకుపోతున్నాడు. గతంలో తెలుగు భాషకే పరిమితం అయిన ఈ స్టార్ హీరో.. 'బాహుబలి' నుంచి పంథాను మార్చుకున్నాడు. ఈ చిత్రంతో ప్రపంచానికి పరిచయం అయిన అతడు.. అప్పటి నుంచి వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. దీంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అలా రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక, ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో 'సలార్' ఒకటి. ఈ చిత్రాన్ని 'కేజీఎఫ్' వంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించిన ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ మూవీ షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో కంప్లీట్ చేసుకుంది. అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌ను కూడా రూపొందించారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెండోది కూడా మొదలైంది. ఈ షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేసుకున్నారు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీకి సంబంధించిన రెండో షెడ్యూల్‌ను గుజరాత్‌లో ప్లాన్ చేసుకున్నా.. కోవిడ్ నిబంధనల కారణంగా దాన్ని హైదరాబాద్‌కు షిప్ట్ చేశారు. ఇక, ఇప్పుడు ఈ సినిమాలోనే ఎంతో హైలైట్ అయిన ప్రీ క్లైమాక్స్ ఫైట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియో భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారని అంటున్నారు. దీని కోసం దాదాపు 20 నుంచి 30 రోజుల పాటు షూటింగ్‌ను జరపబోతున్నారట. మరికొన్ని రోజుల్లోనే దీన్ని మొదలు పెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇవన్నీ ఇలా ఉండగా.. 'సలార్' మూవీ నుంచి గతంలో కొన్ని పిక్స్, వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌ను జరుపుతున్నారు. అయినప్పటికీ ఏదో ఒకటి లీక్ అవుతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో తీసిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఇందులో ప్రభాస్ వైలెంట్ లుక్‌తో భయపెట్టేలా ఉన్నాడు. ఈ ఆరడుగుల కటౌట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. దీంతో ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.
భారీ బడ్జెట్‌తో క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. జగపతి బాబు విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే, ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దీన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ ఏరియాలోనే ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











