Prabhas: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్.. కారణం ఏంటంటే?

తెలంగాణ శాసన సభ ఎన్నికలు ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రమంతటా ప్రజలు ఓటేసేందుకు పొటేత్తారు. ఇక సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకు ఓటు వేసేందుకు తరలి వచ్చారు. అయితే హీరో ప్రభాస్ మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలుస్తోంది. ఆయనకు ఇక్కడే ఓటు హక్కు ఉన్నప్పటికీ.. ఓటును వేయకపోవడం వెనుక ఓ భారీ కారణం ఉందని తెలుస్తోంది. అసలు ప్రభాస్ ఎందుకు బయటకు రాలేదు.. ఓటు వేయలేదనే విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా పూర్తయింది. గురువారం దాదాపు రాష్ట్రమంతటా చాలామంది ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. ఇక గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం కాస్త తగ్గిందనే చెప్పాలి. కేవలం 67 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇక లైన్లో ఉన్న ఓటర్ల ఓటింగ్ పూర్తి అయితే... పూర్తి లెక్కలు బయటకు వస్తాయి. చాలా వరకు జనాలు బయటకు వచ్చి ఓటు వేశారు.

 Hero Prabhas Not Cast Vote Telangana Elections 2023 Full Details Here

ఇక మరోవైపు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ, కూతురు శ్రీజతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఇక వెంకటేశ్, నాగార్జున, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, నితిన్, విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, రాజమౌళి దంపతులు, సుకుమార్ దంపతులు, శ్రీముఖి, బండ్ల గణేష్, బేబీ దర్శకుడు, బేబీ నిర్మాత, రవితేజ, రామ్, హరీష్ శంకర్, రాజశేఖర్, మంచు లక్ష్మి, మారుతి.. తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దాదాపు తెలుగు సినీ సెలబ్రిటీలు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోల్ని తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. అయితే ఆ సెలబ్రెటీల్లో హీరో ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ తన ఓటు హక్కును ఉపయోగించుకోలేదని తెలుస్తోంది. ఎందుకు ప్రభాస్ బయటకు వచ్చి ఓటు వేయలేదని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

 Hero Prabhas Not Cast Vote Telangana Elections 2023 Full Details Here

ఇక ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్'.. డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో ట్రైలర్ విడుదల కానుంది. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ ని గ్రాండ్‌ గా ప్లాన్ చేయాలనుకున్నారని సమాచారం. కానీ కొన్నాళ్ల క్రితం విదేశాల్లో మోకాలి సర్జరీ చేయించుకున్న ప్రభాస్ ఈ మధ్యే ఇండియాకి వచ్చారు.

హైదరాబాద్‌లోనే ఉన్న ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ మోడ్‌ లో ఉన్నారని సమాచారం. అందుకే 'సలార్' ట్రైలర్‌ ని కూడా సింపుల్‌ గా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు అదే విశ్రాంతి వల్ల తెలంగాణ ఎన్నికల్లోనూ ప్రభాస్ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాడని అంటున్నారు. ప్రభాస్ హైదరాబాద్‌ లోని మణికొండ హైస్కూల్‌ లో ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. కానీ ఇప్పటివరకైతే ప్రభాస్ అక్కడికి వచ్చినట్లు సమాచారం లేదు. దీంతో ప్రభాస్ తన ఓటును వినియోగించుకోలేదని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X