Prabhas Salaar: సలార్ రిలీజ్ టైంలో షాకిచ్చిన ప్రభాస్?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. సలార్ సినిమాతో బిజిగా ఉన్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ లాంటి సిరీస్ మూవీస్ లతో ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇక ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ అభిమానులకు ఓ షాక్ ఇచ్చేశాడు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు నిజంగానే డిలీట్ చేశాడా హ్యాక్ కు గురైందా... లేదా డియాక్టివేట్ చేశాడా అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు.. ముఖ్యంగా ఆయన జనాల్లో ఎక్కువగా కనిపించడు. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టివ్ గా ఉండడు. టాలీవుడ్ స్టార్ హీరోలు అంతా... యాక్టివ్ గా ఉంటూ క్రేజ్ పెంచుకుంటున్నారు. ప్రభాస్ మాత్రం అంతగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. అయితే తాజాగా ప్రభాస్ చేసిన పనికి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

చాలా కాలంగా ప్రభాస్ కు అంతగా కలిసి రావడం లేదు. బహుబలి సీరిస్ తర్వాత ఆయన నటించిన ఏ సినిమా ఆ రేంజులో హిట్ కాలేదు. సాహో, రాదేశ్యాం, ఆదిపురుష్ సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం సలార్. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.
ఇక సలార్ సినిమాను హౌంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుడగా... ఇప్పటికే రీలీజ్ చేసిన గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు అప్పడు అనౌన్స్ చేయగా దీనిని మళ్లీ పోస్ట్ పోన్ చేసి.. డిసెంబర్ కు మార్చారు.

రెండు పార్టులుగా రానున్న సలార్... మొదటి పార్టును డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే రిలీజ్ కు ముందే ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనిపించడం లేదని తెలుస్తోంది. ఆ అకౌంట్ డిలీట్ అయ్యిందా..? లేదా హ్యాక్ అయ్యిందా..? లేదా డీయాక్టివేట్ చేశారా అని అభిమానులు నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

గతంలో ప్రభాస్ పేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ కాగా... ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మిస్ అవ్వడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక ఈ అకౌంట్ ఏమైందో అనేది ప్రభాస్ టీం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మరి సలార్ రిలీజ్ కు ముందు ఇలా ప్రభాస్ షాక్ ఇచ్చాడేంటి అని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇక సలార్ సినిమా రిలీజ్ కు పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











