సిక్స్‌ప్యాక్‌తో హీరో ప్రిన్స్ స్టన్నింగ్.. నలుగురు హీరోయిన్లతో రొమాన్స్

By Rajababu

Recommended Video

Hero Prince Stunning Look Surprises His Fans

గతంలో లవర్ బాయ్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రిన్స్ కొత్త అవతారం ఎత్తాడు. ఓ ప్రేమ కథ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కొత్తదనం నిండి ఉన్న కథతో మరో ప్రేమకథా చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా చెబుతోన్న ఈ మూవీలో బస్‌స్టాప్ ఫేమ్ ప్రిన్స్ హీరోగా నటిస్తున్నాడు.

బిగ్‌బాస్1 సీజన్‌తో మంచి క్రేజ్

బిగ్‌బాస్1 సీజన్‌తో మంచి క్రేజ్

తెలుగులో బిగ్‌బాస్1 సీజన్‌లో కంటెంస్టెంట్ గా తిరుగులేని ఆదరణ తెచ్చుకున్నాడు ప్రిన్స్. ఆ రియాలిటీ షోతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను దగ్గరయ్యారు. గత కొన్నాళ్లుగా మంచి కథల కోసం వెయిట్ చేస్తోన్న ప్రిన్స్‌కు ఈ కథ గ్రాండ్ రీ లాంచింగ్‌గా మారబోతుందనే మాట వినిపిస్తున్నది. ఒకరకంగా ఈ మూవీతో ప్రిన్స్ సరికొత్తగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం తన లుక్‌ను కంప్లీట్‌గా మార్చుకోవడం గమనార్హం.

స్టన్నింగ్ లుక్‌తో ప్రిన్స్

స్టన్నింగ్ లుక్‌తో ప్రిన్స్

ప్రిన్స్ తాజా లుక్ సినీ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నది. అలాగే ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్‌తో ముందుకొచ్చాడు. ఈ స్టోరికి తగినట్టుగా తనను తాను మార్చుకోవడంపై అభినందనల వర్షం కురుస్తున్నది. స్టన్నింగ్ లుక్‌తో కనిపిస్తున్న ప్రిన్స్ పోస్టర్లు షాక్ గురిచేస్తున్నాయి.

ప్రిన్స్ సరసన నలుగురు హీరోయిన్లు

ప్రిన్స్ సరసన నలుగురు హీరోయిన్లు

ఇంకా పేరు పెట్టని సినిమాలో ప్రిన్స్ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటించబోతోంది. ఆ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచినట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ చిత్రాన్ని లడక్, గోవా, హైదరాబాద్, వారణాసి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏ సుశాంత్ రెడ్డి డైరెక్షన్‌లో

ఏ సుశాంత్ రెడ్డి డైరెక్షన్‌లో

గతంలో ‘సూపర్ స్టార్ కిడ్నాప్' అనే చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఏ. సుశాంత్ రెడ్డి మరోసారి తన స్వీయ నిర్మాణ సారథ్యంలో దర్శకత్వం కూడా వహిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అతి త్వరలో ప్రారంభం కాబోతోన్న ఈ మూవీ ఆ వెంటనే రెగ్యులర్ షూట్ కు వెళుతుంది.

సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం

వి కృష్ణారావు కొల్లూరి సమర్మిస్తోన్న ఈ చిత్రం ‘సోరింగ్ ఎలిఫెంట్' బ్యానర్ పై రూపొందబోతోంది. ఈ చిత్రానికి కెమెరామెన్ : సామల భాస్కర్, సంగీతం: హరి గౌర, పి.ఆర్.వో: జి.ఎస్. కె మీడియా, సహ నిర్మాతలు: పొనుగుమాటి దిలీప్ కుమార్, నేతి పద్మాకర్, నిర్మాత, దర్శకత్వం : ఏ సుశాంత్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X