twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజ్ తరుణ్‌ను అరెస్ట్ చేసింది నిజమే.. మీడియాతో మాదాపూర్ డీసీపీ

    |

    రెండు రోజుల క్రితం కారు ప్రమాద ఘటనలో సినీ హీరో రాజ్ తరుణ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ అరెస్ట్ వార్తను మాదాపూర్ ట్రాఫిక్ డీఎస్పీ ధృవీకరించారు. ఈ కేసులో 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    కారు ప్రమాద ఘటనపై రాజ్ తరుణ్‌ నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశాం. ఈ కేసులో 279, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని, విచారణ పూర్తయిన తర్వాత మీడియాకు వివరాలను తెలియజేస్తామని పేర్కొన్నారు.

    Hero Raj Tarun arrest: Madhapur police confirmed

    బుధవారం తెల్లవారుజాముణ హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే హీరో తరుణ్ కారు అని మీడియాలో వార్తలు వచ్చాయి. కారు ప్రమాదానికి గురైంది తాను కానని, అతడు, కుటుంబ సభ్యులు ఖండించారు. ఆ తర్వాత ఆ కారు యువ హీరో రాజ్ తరుణ్ అనే విషయం తెరపైకి వచ్చింది. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ కూడా మీడియాలో హల్‌చల్ చేసింది. ప్రమాదం అనంతరం కారు దిగి పారిపోతున్న వ్యక్తి రాజ్ తరుణ్‌లా ఉండడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది.

    English summary
    Tollywood hero Raj Tarun arrested in Car accident which happend on 20th of August. In this connection, Raj Tarun arrested by Madhapur Police. Police were confired his arrest to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X