నన్ను నా భార్యను అలా దారుణంగా అవమానించింది.. లావణ్యపై రాజ్ తరుణ్ తండ్రి ఆరోపణలు
రాజ్ తరుణ్ - లావణ్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. తనను దూరం పెట్టి .. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తిరుగుతున్నాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గర్భం దాల్చితే రాజే దగ్గరుండి అబార్షన్ చేయించాడని ఆరోపించింది. రాజ్ తరుణ్‌ని వదలకుంటే అంతు చూస్తామని మాల్వీ మల్హోత్రా , ఆమె సోదరుడు బెదిరిస్తున్నారని ఆరోపించింది. మెడికల్ రిపోర్టులు, దాదాపు 170 ఫోటోలను నార్సింగి పోలీసులకు లావణ్య అందజేసింది. ఆమె ఆరోపణల మేరకు రాజ్ తరుణ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఈ ఆరోపణలను రాజ్ తరుణ్ సైతం ఖండిస్తూ వస్తున్నారు. లావణ్యతో రిలేషన్‌లో ఉన్న మాట నిజమేనని.. అయితే 2017 తర్వాత తనకు దూరంగా ఉంటున్నట్లు చెప్పాడు. మాల్వీ తన కో స్టార్ అని.. ఆమెతో కలిసి నటించానని తెలిపాడు. తన ఫ్లాట్‌ను కొట్టేయడానికే లావణ్య ఈ బ్లాక్‌మెయిలింగ్‌కి దిగిందని ఆరోపించాడు. అటు మాల్వీ సైతం లావణ్య ఆరోపణలను ఖండించింది. రాజ్ తరుణ్‌తో కలిసి నటించిన హీరోయిన్స్‌ని ఆమె వేధిస్తోందని మండిపడింది. ఈ క్రమంలో తన పరువు , ప్రతిష్టలకు భంగం కలిగించిందంటూ లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదిలాఉండగా.. రాజ్ తరుణ్ కేసులో రోజుకొక క్యారెక్టర్ తెరపైకి వస్తోంది. తాజాగా హీరో ఫ్రెండ్‌నంటూ ఆర్జే శేఖర్ భాష హల్ చల్ చేస్తున్నాడు. మీడియాకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ లావణ్యపై ఆరోపణలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో లావణ్య స్వయంగా అతనికి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగింది. భార్యాభర్తల మధ్య నువ్వెందుకు వస్తున్నావ్.. నీకెంటీ సంబంధం అంటూ నిలదీసింది. వీరిద్దరి ఫోన్ కాల్‌కు సంబంధించిన ఆడియో మొన్నామధ్య సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
ఈ క్రమంలో ఆర్జే శేఖర్ భాష ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ మరోసారి లావణ్యపై విరుచుకుపడ్డారు. ఆవిడ అందరిపై బురద జల్లాలని చూస్తోందని మండిపడ్డారు. ఇంతలో యాంకర్.. రాజ్ తరుణ్ తండ్రితో మాట్లాడాలని కోరగా శేఖర్ వెంటనే అతని తండ్రి బసవరాజుకు ఫోన్ చేసి లైవ్‌లో మాట్లాడించారు. లావణ్య తనకు కొన్నేళ్ల నుంచి తెలుసునని , రాజ్‌తోనే కలిసి ఒకే ఇంట్లో ఉండేదని తెలిపారు. ఆమెను ఒకానొక దశలో పెళ్లి చేసుకోవాలని రాజ్ అనుకున్నాడని అయితే లావణ్య బిహేవియర్‌లో మార్పులు కనిపించడంతో పాటు ఇంటికి ఎవరెవరో వ్యక్తులు వచ్చి వెళ్తుండటంతో పాటు ఆమె వ్యసనాలకు బానిస కావడంతో లావణ్యను దూరం పెట్టాడని బసవరాజు తెలిపారు.

ఆర్నెళ్లకొకసారో, ఏడాదికోసారో రాజ్‌తరుణ్‌ని చూడటానికి తన భార్యను తీసుకుని వెళ్లేవాడినని గుర్తుచేసుకున్నారు. మూడు రోజులు ఉందామని వెళితే.. లావణ్య తీరు నచ్చక రెండ్రోజులకే ఇంటికి తిరిగొచ్చేసేవాళ్లమని బసవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన భార్యను లావణ్య అవమానించేదని.. నానామాటలూ అనేదని తెలిపారు. గౌరవంగా చూసుకోవాల్సిన రాజ్ తరుణ్ తల్లితో ఆవిడ అంట్లు తోమించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ తిరిగి ఇంటికి వచ్చి.. ఆవిడ చెప్పినట్లు వినాలని, ఆమె విలాసాలకు డబ్బులు ఇవ్వాలనే ఇదంతా చేస్తుందన్నారు. ఎలాగైనా తన పంతం నెగ్గించుకుని రాజ్‌తరుణ్‌ని సొంతం చేసుకోవాలని చూస్తోందని బసవరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ తండ్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై లావణ్య ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











