మరో వ్యక్తితో సహజీవనం.. నా ఫ్లాట్ కొట్టేయడానికి బిగ్ స్కెచ్.. రాజ్‌తరుణ్ షాకింగ్‌గా
రాజ్ తరుణ్.. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యూట్యూబ్‌లో పాపులరై దాని సాయంతో హీరోగా ఎదిగాడు. సినిమాలపై పిచ్చి, కృషి, పట్టుదలే ఈ కుర్రాడిని ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. తొలి చిత్రం ఉయ్యాల జంపాలకు ఏకంగా అక్కినేని నాగార్జున, దగ్గుబాటి సురేష్ బాబులు నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమా ఘన విజయం సాధించడతో రాజ్ తరుణ్‌కు వరుస అవకాశాలు క్యూకట్టాయి. ఆ వెంటనే కుమార్ 21 ఎఫ్ కూడా బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ కుర్రాడి ఇంటి ముందు దర్శక నిర్మాతలు పడిగాపులు కాసేవారు.
కానీ ఈ స్టార్‌డమ్‌ను ఆయన నిలబెట్టులేకపోయారు. ఒకటే తరహా కథలతో మూసకొట్టుడు డ్రామాతో జనం రాజ్ తరణ్ సినిమాలకు రావడం మానేశారు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడో రకం ఆడో రకం, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే, ఒరేమ్ బుజ్జిగా, పవర్ ప్లే, అనుభవించు రాజా, స్టాండప్ రాహుల్ వంటి చిత్రాలు అంతగా ఆదరణకు నోచుకోలేదు.

కెరీర్ పరంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వేళ రాజ్ తరుణ్ వివాదంలో చిక్కుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడంటూ హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నామని, గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని.. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని, 45 రోజులు జైల్లో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
రాజ్ తరుణ్‌తో రిలేషన్‌లో ఉన్న మాల్వీ మల్హోత్రా అనే నటి, ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని.. రాజ్ తరుణ్ లైఫ్‌లోంచి వెళ్లకపోతే చంపుతామని వార్నింగ్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ సీఎం తన తండ్రికి ఫ్రెండ్ అనీ.. తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని నన్ను వారిద్దరూ బెదిరించారని లావణ్య ఆరోపించింది. మాల్వీ ట్రాప్‌లో పడి రాజ్ తరుణ్ తనకు దూరంగా ఉంటున్నాడని.. ఆయన లేకపోతే తాను ఉండలేనని తేల్చిచెప్పింది.
ఈ ఆరోపణలపై రాజ్ తరుణ్ ఘాటుగా బదులిచ్చారు. తన జీవితంలో ఇవాళ్టీ దాకా డ్రగ్స్ ముట్టుకోలేదు, ఇకపైనా ముట్టుకోనని ఆయన స్పష్టం చేశారు. కావాలంటే నా హెయిర్ , బ్లడ్ శాంపిల్స్ ఇస్తానని రాజ్ తరుణ్ సవాల్ విసిరారు. లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ తనకుంటే ఇవాళ తన జీవితం ఇలా ఉండేది కాదన్నారు. తన ఫ్రెండ్స్, నాతో పనిచేసిన దర్శకులను లావణ్య ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతోందని .. దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని రాజ్ తరుణ్ తెలిపారు.

లావణ్య మంచి వ్యక్తేనని.. చాలా సాయం చేసిందని అందుకు తాను కృతజ్ఞతగా ఉంటానని 2017 వరకు మాత్రమే శారీరకంగా, మానసికంగా రిలేషన్‌లో ఉన్నామని రాజ్ తరుణ్ వెల్లడించారు. కానీ తర్వాత తను డ్రగ్ అడిక్ట్ అయ్యిందని, చెడు స్నేహాలు చేస్తోందని దీంతో ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయమన్నానని ఆయన చెప్పారు. ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్‌ను దక్కించుకోవడానికే ఈ కేసు పెట్టి.. తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని నేనే ఆమెకు కావాల్సి వస్తే మస్తాన్ అనే వ్యక్తితో ఎందుకు డేటింగ్ చేస్తోందని రాజ్ తరుణ్ ప్రశ్నించారు.
కన్న తండ్రినే ఆమె మోసం చేసిందని.. ఆమె తమ్ముడు తనకు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అని ఆయన తెలిపారు. మాల్వీ మల్హోత్రా తనకు క్లోజ్ ఫ్రెండ్ అని.. ముంబైలో ఉండే ఆమెకు, హైదరాబాద్‌లో ఉండే తనకు రిలేషన్‌షిప్ ఎలా సాధ్యమవుతుందని రాజ్ తరుణ్ ప్రశ్నించారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ - లావణ్య ఎపిసోడ్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











