రాజ్‌తరుణ్ ఆత్మాహత్యాయత్నం.. ఆ నటుడు కాపాడకుంటే అత్యంత దారుణంగా పరిస్థితి!

యువ హీరో రాజ్ తరుణ్ - లావణ్యల కేసు తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. తనతో సహజీవనం చేసి ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తనను దూరం పెడుతున్నాడని లావణ్య అనే యువతి హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను చంపేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు బెదిరిస్తున్నారని పేర్కొంది. తాను గర్భం దాల్చడంతో రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు, దాదాపు 170 ఫోటోలను లావణ్య పోలీసులకు అందజేసింది. వీటి ఆధారంగా రాజ్ తరుణ్‌పై ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

కేసుపై పోలీసుల విచారణ జరుగుతున్న దశలోనే రాజ్ లేకుండా తాను బతకలేనని, అన్నింటికీ మాల్వీయే కారణమంటూ అర్ధరాత్రి పూట తన లాయర్‌కు సూసైడ్ మెసేజ్ పెట్టి కలకలం సృష్టించింది లావణ్య. పోలీసులు సమయానికి ఆమె ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫిర్యాదులో ఆరోపించిన అంశాలకు పక్కా ఆధారాలు సమర్పిస్తే రాజ్ తరుణ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నేరం రుజువైన పక్షంలో ఆయనకు కఠినమైన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు.

hero raj tarun wants to commit suicide says actor madhunandan

కెరీర్ పరంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు పర్సనల్ లైఫ్‌లోనూ సమస్యలతో సతమతమవుతున్నాడు. లావణ్య కేసులో అతనికి శిక్షపడితే రాజ్‌తో సినిమాలు కమిటైన దర్శక, నిర్మాతలుకు ఇబ్బందులు తప్పవు. అయితే ఒకానొక దశలో రాజ్‌తరుణ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, నటుడు మధునందన్ తెలిపారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో కోవిడ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించి, దానిని పొడిగించుకుంటూ పోయిందన్నారు.

అయితే గోవాకు విహారయాత్ర నిమిత్తం వెళ్లిన రాజ్‌తరుణ్ కుటుంబం లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఏదో కొద్దిరోజులు ఉంటుంది అనుకుంటే , ఏకంగా రెండు నెలలు లాక్‌డౌన్ ఉండటంతో రాజ్‌తరుణ్ హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉండిపోయాడని మధునందన్ తెలిపారు. బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా జీవించలేక తనకు ఓ రోజు ఫోన్ చేసి ఇంకో వారం పరిస్ధితి ఇలాగే ఉంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో తన ఫ్రెండ్ కారుకి ఎమర్జెన్సీ పాస్ ఉంది, దాని ద్వారా ట్రాఫిక్ పోలీసులకు నిత్యావసర సరుకులు అందించే వాళ్లమని మధునందన్ చెప్పారు.

దీని సాయంతో తన ఫ్రెండ్‌కి గండిపేటలోని రాజ్ తరుణ్ అడ్రస్ ఇచ్చి తీసుకురమ్మని చెప్పానని ఆయన వెల్లడించారు. క్యాప్ పెట్టుకుని కూర్చొన్న రాజ్‌ని చూసి తన ఫ్రెండ్ షాక్ అయ్యాడని మధునందన్ తెలిపారు. తన అపార్ట్‌మెంట్‌లో సుమారు 20 మంది పిల్లలు ఉండటంతో వారితో ఆడుకుంటూ రాజ్ ఎంజాయ్ చేశారని, అలా మూడు వారాల పాటు తన ఇంట్లోనే రాజ్ ఉండిపోయాడని ఆయన చెప్పాడు. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపు ఇవ్వడంతో గోవా నుంచి రాజ్ ఫ్యామిలీ తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో అప్పుడు గానీ ఇంటికి వెళ్లలేదని మధునందన్ చెప్పారు. ప్రస్తుతం లావణ్య కేసు నేపథ్యంలో రాజ్‌తరుణ్‌పై ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: raj tarun lavanya malvi malhotra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X