హీరో రాజశేఖర్ భారీ విరాళం.. సంక్షేమానికి పాటుపడుతానని వెల్లడి

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడించింది. ఎన్నికల సందర్భంగా 'మా' సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే హామీల అమలు కోసం మూలధనంను తీసి ఖర్చుచేయడం సమంజసం కాదని మా కమిటీ భావించింది. ఈ క్రమంలో మా యూనియన్‌కు అండగా ఉండేదుకు హీరో రాజశేఖర్ ముందుకొచ్చారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. మా కోసం తన వంతుగా రూ. 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఇంతవరకూ 'మా' అసోసియేషన్ అదనపు నిధులను సేకరించే సంక్షేమ కార్యక్రమాలు జరుపుతున్నది. ఈసారి కూడా అదే తరహాలో నిధులను సేకరించాలని నిర్ణయించుకున్నాం అని 'మా' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజశేఖర్ చెప్పారు.

Hero Rajasekhar announced Rs.10 lakh donation to MAA

చిత్రసీమలోని అందరి సహకారంతో త్వరలోనే కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి, నిధులను సమీకరిస్తామని తెలిపారు. డా. రాజశేఖర్ 'మా'కు పది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం పట్ల కార్యవర్గ సభ్యులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

కాగా, ఇటీవల కాలంలో మా యూనియన్‌లో ఆధిపత్య పోరాటం జరుగుతున్నదని వచ్చిన వార్తలను మా సంఘం ఖండించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X