హీరో రాజశేఖర్‌కు తప్పని కరోనా కష్టాలు.. టాలీవుడ్‌పై వైరస్ దెబ్బ!
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నది. పలు కంపెనీలు, స్కూల్స్ ఉద్యోగులకు సెలవులు ప్రకటించడంతో వ్యాపార రంగాలపై గట్టి షాక్ తగిలింది. కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై కూడా భారీగానే పడింది. ఓ దశలో సినిమా హాళ్లను మూసి వేయాలనే దిశగా నిర్ణయాలు జరిగాయి. కానీ కరోనాను నిలువరించే చర్యలు తీసుకొంటూ ప్రభుత్వం సినిమా హాళ్ల నిర్ణయాన్ని వెనుకకు తీసుకొన్నది. ఈ క్రమంలో కరోనా నేపథ్యంలో పలు సినిమాల రిలీజ్‌ను వాయిదా వేసుకొన్నారు. అందులో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ సినిమా కూడా వెనకడుగు వేసింది.

కరోనా ప్రభావం స్పష్టంగా
సినిమా పరిశ్రమపై కరోనా వైరస్ ప్రభావం స్పష్టంగా పడింది. పలు పెద్ద హీరోలు తమ సినిమాల షూటింగ్‌లను తాత్కాలికంగా వాయిదా వేసుకొన్నారు. పలు సినిమాల రిలీజ్‌లు వెనకకు వెళ్లాయి. దాంతో దేశ సినీ పరిశ్రమపై వ్యాపారం పరంగా భారీగానే నష్టం జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే పలు సినిమా కలెక్షన్ల చూస్తే టాలీవుడ్ రంగంపై కూడా స్పష్టమైన ప్రభావం కనిపిస్తుందని డిస్టిబ్యూటర్లు పేర్కొంటున్నారు.

డాక్టర్ రాజశేఖర్‌కు తప్పని కష్టాలు
డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం అర్జున. ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లు మార్చి 6న కాకుండా 13న విడుదల చేయాలని నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు. కరోనా ప్రభావం కారణంగానే చిత్రం విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు కనుక, సినిమాపై ప్రభావం పడకుండా ఈ నిర్ణయం తీసుకొన్నామన్నారు.

ద్విపాత్రాభినయంతో
అర్జున చిత్రంలో హీరో రాజశేఖర్ సరసన అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం ట్రైలర్స్ ఇటీవల విడుదలై...ట్రెండింగ్ లో ఉన్నాయని వారు చెప్పారు. ఇందులో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ అద్భుతమైన నటనను కనబరిచారని నట్టి కరుణ అన్నారు.
Recommended Video


భావోద్వేగమైన సన్నివేశాలతో..
సమకాలీన రాజకీయ నేపధ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిదని, యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దీనిని మలచడం జరిగిందని చెప్పారు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ... అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారని అన్నారు. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తాయి అని నట్టి క్రాంతి తెలిపారు.


Click it and Unblock the Notifications











