twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రజల ప్రాణాలు తీస్తారా? దొంగలకు ఆయుధం దొరికినట్టే.. హీరో రాజశేఖర్ ఫైర్

    |

    నాలుగేళ్లు ఎంబీబీఎస్ చదివి, తర్వాత ఓ ఏడాది హౌస్ సర్జన్‌గా సేవలు చేస్తే ప్రభుత్వం డాక్టర్ పట్టా చేతికి వస్తుంది. ఇప్పటివరకూ ఇదే పద్దతి నడిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'జాతీయ మెడికల్ కమిషన్' (ఎన్.ఎం.సి) ద్వారా ఆయుర్వేద, యునాని, ఇతర వైద్యవిద్యను అభ్యసించినవారు ఎవరైనా కొత్తగా ప్రవేశపెట్టే ఆరు నెలల కోర్సులో ఉత్తీర్ణత సాధిస్తే, ఎంబీబీఎస్ డాక్టర్స్ తరహాలో ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ బిల్లును ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఆయన మద్దతు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. మన దేశంలో ఇప్పటివరకూ నటీనటులు ఎవరూ ఎన్ఎంసి బిల్లుపై స్పందించలేదు. రాజశేఖర్ గారు స్పందించడంతో వెలుగులోకి వచ్చింది. జూనియర్ డాక్టర్ల నిరసనకు ప్రచారం దక్కింది. సామాన్య ప్రజలకు, సినిమా ప్రేక్షకులకు తెలిసింది.

    Hero Rajasekhar serious on National Medical Commissions MBBS crash course

    రాజశేఖర్ మాట్లాడుతూ "ఎన్ఎంసీ బిల్లులో కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పారు. అవేంటి? అనేది తెలియజేయలేదు. ఫలానా వ్యక్తికి వైద్య సేవలు అందించే అర్హత ఉందని, లేదని ఎలా చెబుతారు? ఎంబీబీఎస్ చదివి, తర్వాత హౌస్ సర్జన్ చేయడం మామూలు విషయం కాదు. అదొక పెద్ద సబ్జెక్టు. ఆరు నెలలు క్రాష్ కోర్సు చేస్తే సులభంగా డాక్టర్లు కావొచ్చంటే ఎలా? ఆరు నెలలలో ఎలా వైద్యుణ్ణి తయారు చేస్తారు? అనుకోనివి జరిగితే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ప్రాణాలతో చెలగాటం ఆడే ఇటువంటి బిల్లును ఒక వైద్యుడిగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను" అని అన్నారు.

    Hero Rajasekhar serious on National Medical Commissions MBBS crash course

    క్రాష్ కోర్సు చేయడానికి వైద్య వృత్తి ఏమైనా డ్రాయింగా? పెయింటింగా? అని రాజశేఖర్ ప్రశ్నించారు. "ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ బదులు క్రాష్ కోర్సులు పెడితే బిల్డింగులు కూలిపోతాయి. ప్రజల ప్రాణాలు పోతాయి" అని జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి రాజశేఖర్ మద్దతు తెలిపారు. "ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది దొంగ డాక్టర్లు చలామణీ అవుతున్నారు. ఇటువంటి బిల్లు వస్తే అలాంటి దొంగ డాక్టర్లకు ఆయుధం దొరికినట్టు ఉంటుంది" అని రాజశేఖర్ అన్నారు.

    Read more about: రాజశేఖర్
    English summary
    Hero Rajasekhar serious on National Medical Commission's MBBS crash course. If this is the way gives acceptancy for doctor.. That will be put people health in risk. That is reason, Rajasekhar opposing the NMC Bill
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X