నేను పిరికివాడిని, చిరు సపోర్ట్ ఇచ్చారు: హీరో రాజశేఖర్ స్పీచ్ అదుర్స్

Recommended Video

Hero Rajasekhar Speech After Winning MAA Elections 2019 | Filmibeat Telugu

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నరేష్ ప్యానల్ ఘన విజయం సాధించింది. ప్రెసిడెంటుగా నరేష్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటుగా రాజశేఖర్, జనరల్ సెక్రటరీగా జీవిత ఎన్నికయ్యారు. ఆదివారం అర్థరాత్రి ఫలితాలు ప్రకటించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రాజశేఖర్ తన ప్రసంగంతో అందరినీ నవ్వించాడు.

''ఎన్నికల్లో పోటీ అని చెప్పకుండా ఇదొక హానరరీ పోస్టు అని చెప్పి నన్ను ఇందులోకి లాగారు. తమిళ ఇండస్ట్రీలో, మలయాళ ఇండస్ట్రీలో మంచి పనులు చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేక పోతున్నాం అనే ఆలోచన నాలో మెదిలింది. 'మా'ర్పులో భాగం కావాలని ఎన్నికల్లో పోటీ చేశాను అని రాజశేఖర్ తెలిపారు.

వెంటనే నిర్ణయించుకున్నాను

వెంటనే నిర్ణయించుకున్నాను

‘సినిమా షూటింగులు లేనపుడు ఈవినింగ్ టైమ్ ఇంట్లో కూర్చుని ఉన్నపుడు డిప్రెషన్‌కు గురికాకుండా ఉండటానికి ఏదైనా చేద్దాం అనుకునే సమయంలో నరేష్ ఎన్నికల ప్రపోజల్‌తో వచ్చారు. వెంటనే ఇండస్ట్రీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాను.' అని రాజశేఖర్ తెలిపారు.

నేను చాలా పిరికివాడిని

నేను చాలా పిరికివాడిని

నేను చాలా పిరికివాడిని, కాంపిటీషన్ పరిస్థితులను నేను తట్టుకోలేను. అలాంటి నేను మొదటి సారి ఎలక్షన్ ఓటింగ్ సిస్టంలో గెలుపొందాను. ఈ రోజు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. నాకు పోటీగా ఇంకో హీరో శ్రీకాంత్ నిలబడ్డారు. ఆయన మంచి క్రికెటర్, అందరితో ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్న వ్యక్తి... నేను ఎక్కువగా ఎవరినీ కలవను, అలాంటి నాకు ఓటే వేస్తారా? గెలుస్తానా? అనే భయం ఉండేది. చాలా భయాల మధ్య టెన్షన్లో ఉన్నపుడు ఓటింగ్ ఫలితాలు మరింత ఆనందాన్ని ఇచ్చిందని రాజశేఖర్ తెలిపారు.

చిరంజీవితో పాటు అందరూ సపోర్ట్ ఇచ్చారు

చిరంజీవితో పాటు అందరూ సపోర్ట్ ఇచ్చారు

ఎన్నికల్లో పోటీ చేసిన రెండు టీమ్స్ ఇపుడు ఒకటే టీంగా తయారయ్యాయి. మా టీంకు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య ఇలా అందరూ సహకరిస్తామని, బ్రహ్మాండంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను ముందుకు తీసుకెళదాం అన్నారు. నరేష్ నేతృత్వంలో నా భార్య చెప్పే మాటలు వింటూ ‘మా'కు ఏం కావాలో అన్నీ చేస్తూ ముందుకు సాగుతాను.. అని రాజశేఖర్ తెలిపారు.

త్వరలో గరుడవేగ 2

త్వరలో గరుడవేగ 2

మా అమ్మగారు పోయారనే బాధలో ఉన్న నేను తేరుకుని ‘కల్కి' సినిమా చేస్తున్నాను. త్వరలో ఈ సినిమా రాబోతోంది. దీంతో పాటు ‘గరుడవేగ పార్ట్ 2' మూవీ కూడా చేయబోతున్నాను. ఈ విషయం ఇక్కడ చెప్పడానికి కారణం నేను మాట్లాడేది కేవలం 800 మంది ‘మా' ఓటర్లు కాకుండా 8 కోట్ల మంది తెలుగు ప్రజలు చూస్తున్నారు. త్వరలోనే మంచి సినిమాలతో మీ ముందుకు వస్తానని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X