సంక్రాంతి బరిలోకి యాంగ్రీ స్టార్ రాజశేఖర్.. బాక్సాఫీస్‌పై గురిపెట్టిన శేఖర్

తెలుగు సినిమా పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాలకు మార్గం సుగమమైంది. సంక్రాంతి పండుగకు రిలీజ్ కావాల్సిన రాధేశ్యామ్, RRR చిత్రాల విడుదల వాయిదా పడటంతో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన శేఖర్ చిత్రం సంక్రాంతి బరిలోకి దూకింది. మర్డర్ మిస్టరీగా రూపొందించిన ఈ చిత్రాన్ని జనవరి రెండోవారంలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. హీరో రాజశేఖర్ ఇమేజ్‌ తగిన క్రేజీ టైటిల్‌ శేఖర్ చిత్రం పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.

పోలీస్ పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ నటిస్తున్న శేఖర్ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ చిత్రం రాజశేఖర్ కెరీర్‌లో 91వ చిత్రం కావడం విశేషంగా మారింది. అలాగే ఈ చిత్రానికి నటి, దర్శకురాలు, రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు పేరుకొన్నాయి.

Hero Rajashekars Shekar movie set to release for Sankranti 2022

ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన శేఖర్ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముక్కుసూటితత్వం కలిగి తన పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా రాజశేఖర్ ఫస్ట్ గ్లింప్స్‌లో కేక పెట్టించారు. స్ట‌యిలిష్‌గా సిగ‌రెట్ వెలిగిస్తూ, సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ బాడీలాంగ్వేజ్ అదరగొట్టింది. ఆచన నటించిన గత చిత్రాలకు భిన్నంగా రోల్, లుక్ కనిపించి తన అభిమానుల్లో జోష్ పెంచారు.

Hero Rajashekars Shekar movie set to release for Sankranti 2022

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జోరుగా జరుపుకొంటున్న శేఖర్ చిత్రం జనవరి రెండోవారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్యాన్ ఇండియా సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో శేఖర్‌ను భారీగా థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను యూనిట్ ప్రకటించనున్నారు.

నటీనటులు: రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్
నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
సినిమాటోగ్రఫి: మల్లికార్జున్ నరగని
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
రైటర్: లక్ష్మీ భూపాల
డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ
ఆర్ట్: సంపత్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X