Don't Miss!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గోవాలో ఘనంగా రామ్ బర్త్ డే.. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ సామాజిక కార్యక్రమాలు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో రామ్ అభిమానులు తమ ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఫ్యాన్స్ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకొన్నారు. పేద ప్రజలకు అన్నదానం చేసి ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకొన్నారు. తన అభిమానులు స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడంపై హీరో రామ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా అభిమానులు స్ఫూర్తిని కలిగించే కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.
ఇదిలా ఉండగా, హీరో రామ్ జన్మదిన వేడుకలను గోవాలో పూరీ జగన్నాథ్ ఘనంగా నిర్వహించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా యూనిట్ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి రామ్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నభా నటేష్, చార్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం నభ నటేష్, రామ్‌పై గోవాలో పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ జన్మదినం రావడం జరిగింది. హీరో రామ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇస్మార్ట్ శంకర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సోషల్, యూ ట్యూబ్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది.
ఇస్మార్ట్ శంకర్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని హీరో రామ్ సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. నా పుట్టిన రోజున నాకు చాలా మంది ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పడం మరిచారు. నా బర్త్ డే రోజున రిలీజైన ఇస్మార్ట్ శంకర్ టీజర్ గురించే మాట్లాడటం మొదలుపెట్టారు. టీజర్ నిడివి, అందులో సన్నివేశాల గురించే మాట్లాడటం చాలా సంతోషం కలిగింది. వారు అంతగా ఇష్టపడినందుకు థ్యాంక్స్. మీ ఆదరాభిమానాలు నాకు ఎంత ముఖ్యమో మీ అందరికి తెలుసు అని హీరో రామ్ ట్వీట్ చేశారు.