నాతో కిరికిరి అంటే.. పోశమ్మ గుడి ముందు పొట్టేలు కట్టిసినట్టే.. ఇస్మార్ట్ శంకర్
సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న మాస్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇస్మార్ట్ శంకర్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. హీరో రామ్ జన్మదినం మే 15ను పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను ప్రేక్షకులకు అందించారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమా టీజర్ గురించి.. పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో టీజర్ మొత్తం నింపేశారు. రామ్ గెటప్, లుక్ ఏక్‌దమ్ ఊరమాస్.. యాక్షన్ సీన్లు, టపోరి హిందీ లాంగ్వేజ్ టీజర్‌కు క్రేజీగా మారాయి. పక్కాగా యూత్‌ను ఆకర్షించే విధంగా టీజర్‌ను కట్ చేశారు.

హీరో రామ్ బాడీలాంగ్వేజ్‌కు తగినట్టుగా రాసిన డైలాగ్స్ కేక పెట్టించాయి. చివర్లో నాతో కిరికిరి.. పోశమ్మ గుడి ముందు పొట్టేలు కట్టిసినట్టే అని రామ్ చెప్పిన డైలాగ్స్ టీజర్‌లో హైలెట్ అనిచెప్పవచ్చు. టీజర్‌లో సీన్లు చూస్తే పూరి మార్కు మేకింగ్, డైలాగ్స్‌తో హీరో రామ్ మాస్ ఎలిమెంట్స్‌తో ఇస్మార్ట్ శంకర్ కనిపించబోతున్నదని స్పష్టమైంది.
ఇస్మార్ట్ శంకర్ చిత్రం పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై దర్శకుడు పూరి, హీరోయిన్ ఛార్మి కౌర్ రూపొందిస్తున్నారు. మాస్, అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేం రాజు తోట సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.
నటీనటులు:
రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు
సాంకేతిక వర్గం:
ఫైట్స్: రియల్ సతీష్
సాహిత్యం: భాస్కరభట్ల
ఎడిటర్: జునైద్ సిద్ధికీ
ఆర్ట్: జానీ షేక్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
మ్యూజిక్: మణిశర్మ
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్
దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











