twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya Pre Release Event: భయంగా ఉంది.. ఈ జన్మకు ఇది చాలు.. రామ్ చరణ్ ఎమోషనల్..

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి మొదటి సారి కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆచార్య సినిమా ఈనెల 29న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మెగా ప్రొడక్షన్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథిగా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తో వర్క్ చేస్తున్న మరికొంత మంది దర్శకులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక రామ్ చరణ్ ఈ ఈవెంట్ లో తనదైన శైలిలో మాట్లాడారు.

    చాలా హార్డ్ వర్క్ చేశారు..

    చాలా హార్డ్ వర్క్ చేశారు..

    రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఈ వేడుకలో పాల్గొన్న అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి రాజమౌళి గారికి కూడా స్పెషల్ థాంక్స్ ఇక ఈ సినిమాకు పని చేసినటువంటి ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారు. మా మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా అన్ని చాలా దగ్గర ఉండి చూసుకున్నారు. ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ వరకు కూడా ఈ సినిమాకు చాలా బాగా హెల్ప్ అయింది ధర్మస్థలి కూడా అద్భుతంగా వచ్చింది.

    ఆ 20 రోజులు..

    ఆ 20 రోజులు..

    మా నాన్న గారిని చూసి 20 ఏళ్ళలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నానో తెలీదుగానీ మారేడిపల్లి లో 20 రోజులపాటు ఉన్నప్పుడు ఇరవై ఏళ్లలో నేర్చుకున్నది చాలా తక్కువ అనిపించింది. అలాంటి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ గారికి స్పెషల్ థాంక్స్ చెప్పుకోవాలి.

     రాజమౌళి చేతిలోనే..

    రాజమౌళి చేతిలోనే..

    ఇక ముఖ్యంగా రాజమౌళి గారి గురించి ఒక విషయం చెప్పాలి. బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ చేతిలో సిద్ధార్థ చేయి ఎలా ఉంటుందో అదే తరహాలో రాజమౌళి గారి తో వర్క్ చేసే ప్రతి యాక్టర్ కూడా రాజమౌళి గారి చేతిలోనే ఉంటారు. అలాంటిది రాజమౌళి గారు మొదటి సారి నాన్న గారి గౌరవం మీద అమ్మ గారి కోరిక మేరకు నన్ను RRR సెట్ లో నుంచి ఆచార్య సెట్ లోకి వెళ్లేలా చేశారు. ఈ సందర్భంగా మా అమ్మ గారు తన తరపున రాజమౌళి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి అని కోరుకుంటున్నారు అని రామ్ చరణ్ రాజమౌళి కి తెలియజేశారు.

    కథలో బలం ఉంటే..

    కథలో బలం ఉంటే..

    ఇక కొరటాల శివ గారితో సినిమా చేయాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ చివరికి ఆచార్య సినిమాలో నటించే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన శ్రీమంతుడు జనతా గ్యారేజ్ సినిమాలో మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ చాలా కూల్ గా కనిపించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది హీరోలలో ఒక బుద్ధుడు వివేకానందుడు లాంటి సోల్ కనిపించింది. కథలో బలం ఉంటే యాక్టర్స్ కూడా ఓవరాక్షన్ చేయకుండా చాలా కూల్ గా కనిపిస్తారు అని అర్థమయింది. ఆచార్యకు పని చేసినందుకు నాకు ఒక మంచి అనుభవం ఏర్పడింది. అందుకు కొరటాల శివ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.

     ఎంతో ఆత్రుతగా..

    ఎంతో ఆత్రుతగా..

    నేను RRR సినిమాలో నటించినప్పుడు ఎప్పుడు షూటింగ్ మొదలు పెడదామా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాను. అదేవిధంగా ఆచార్య సినిమాకు కూడా అదే తరహాలో ఫీలింగ్ కలిగింది. మనకు నచ్చిన పని చేసినప్పుడు దానిలో ఏమాత్రము కష్టమనిపించదు. అదే తరహాలో మంచి అనుభూతిని పొందాను. పూజా హెగ్డే కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. ఇక సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నిరంజన్ రెడ్డి గారు ఈ సినిమాకు పూర్తిగా కర్త కర్మ క్రియ అని చెప్పవచ్చు. కేవలం కొణిదెల ప్రొడక్షన్స్ ఒక ప్రసెంటర్ గా మాత్రమే ఉన్నట్లు చరణ్ తెలిపారు.

    నాన్ కరప్ట్ ఇండస్ట్రీ

    నాన్ కరప్ట్ ఇండస్ట్రీ

    డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. సినిమాల్లో కంటే వేరే బిజినెస్ లతో ఇంకా చాలా డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఇలాంటి పేరు అభిమానం మాత్రం ఎక్కడ దొరకవు. చిరంజీవి గారి తో సినిమా తీయడం కుదరదు. రాజమౌళి గారి సినిమాలో ఉండటం కుదరదు. ముఖ్యంగా నేను ఎప్పుడూ ఒకటి చెబుతూనే ఉంటాను. దేశంలో ఎక్కడైనా నాన్ కరప్ట్ ఇండస్ట్రీ ఉంది అంటే అది కేవలం సినిమా ఇండస్ట్రీ అని మాత్రమే చెప్పగలను. టాలెంట్ ఉన్న వారే ఇక్కడ ఉండగలరు. అలాంటి ఇండస్ట్రీలో నేను ఉన్నందుకు.. అభిమానులు నాతో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను.. అని అన్నారు.

    మర్యాదగా ఉండాలి అని అన్నారు..

    మర్యాదగా ఉండాలి అని అన్నారు..

    నేను అందరి కుర్రాళ్ళ తరహాలో పెద్దగా చదువుకోలేదు. నా జీవితంలో బడిలో ఆచార్యులకు కాస్త దూరంగా ఉన్నాను. కానీ ఇంట్లో మాత్రం ఈ ఆచార్యకు దగ్గర ఉన్నాను అందుకే ఇలా మీ ముందుకు వచ్చాను. రాజమౌళి గారు చెప్పింది నిజమే. ఆయన నాకు ఎప్పుడు ఎలా ఉండాలి అని చెప్పలేదు. కాని పెద్దల ముందు మాత్రం మర్యాదగా ఉండాలి అని అన్నారు. రాఘవేంద్ర రావు గారు లాంటి పెద్ద పెద్ద దర్శకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కాళ్లకు దండం పెట్టడం నేర్పేవారు.

    నా జీవితానికి ఇది చాలు..

    నా జీవితానికి ఇది చాలు..

    ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎమోషనల్ అవ్వకూడదు అని అనుకున్నాను. రోజు షూటింగ్ కు ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. కలిసి వర్క్ చేసి కలిసి డ్రైవింగ్ చేసి కలిసి భోజనం చేసి అలాగే కలిసి పడుకునేవాళ్లం.. ఇలా ఇరవై రోజుల పాటు జరిగిన మా మధ్య ప్రయాణం నాకు 13 ఏళ్ల తర్వాత కలిగింది. మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియదు. అది ఆలోచిస్తే నాకు భయంగా ఉంది. అందుకే నేను ఆయనను ప్రతి క్షణం నా మనసులో పెట్టుకుంటాను. ఒకవిధంగా నా జీవితానికి ఇది చాలు అని రామ్ చరణ్ మాట్లాడారు.

    English summary
    Hero Ram charan emotional speech in Acharya Pre Release Event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X