నువ్విచ్చే ప్రేమలానే ఆ నొప్పి కూడా కనబడదు.. ఫైటింగ్ సీన్స్‌లో రామ్ కష్టాలు

చాక్లెట్ బాయ్‌లా ఉండే ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను పక్కింటి గల్లీ పోరడిలా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్‌గా వచ్చిన రామ్.. తిరుగులేని హిట్ కొట్టాడు. ఈ చిత్రం అటు హీరో రామ్‌కు, ఇటు డైరెక్టర్ పూరికి మంచి బూస్టప్‌ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన ఈ ఇద్దరికీ బ్లాక్ బస్టర్ హిట్ దొరికేసింది. దీంతో వీరిద్దరు తమ తదుపరి చిత్రాలను చకచకా లైన్టో పెట్టేసి ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు.

రామ్ ప్రస్తుతం ఓ తమిళ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రారంభోత్సవం రోజున విడుదల చేసిన రామ్ లుక్, రెడ్ (RED) టైటిల్ పోస్టర్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో రామ్ నటన, లుక్స్ అదిరిపోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలెట్టేసిన చిత్రయూనిట్ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో రామ్ గాయపడ్డట్టు తెలుస్తోంది.

Hero Ram Gets Injured In RED Fighting Sequence

ఈ వీడియోలో రామ్ తన గాయాలను చూపిస్తూ.. హే పీటర్ హెయిన్ నువ్వు నిన్న డిజైన్ చేసింది గ్రేట్ ఫైట్. నిన్ను నేను అసలు మిస్ కావడం లేదని చెప్పడానికే ఈ వీడియో చేశాను అంటూ ఓ వీడియోను విడుదల చేస్తూ... నువ్వు చూపించే ప్రేమ కనబడదు కానీ అది ఫీల్ అవుతాను.. అలాగే నువ్విచ్చే బాధ కూడా అంతే కనబడదు.. అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికి రామ్‌ను పీటర్ హెయిన్ అంత కష్టపెడుతున్నాడన్నమాట. ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందిస్తుండగా.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X