మెస్సేజ్ పెడితే పది సినిమాలు స్టార్ట్ అవుతాయి.. త్రివిక్రమ్ సినిమా కూడా: రామ్ పోతినేని
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సక్సెస్ రేటు తక్కువే అయినా చేసిన ప్రతి సినిమాలో డిఫరెంట్ యాంగిల్ లో కనిపిస్తూ ఉంటాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న రామ్ గత కొంత కాలంగా స్టైల్ ను కూడా చాలానే మార్చాడు. ఊర మాస్ స్టైల్ ను ఇస్మార్ట్ శంకర్ తో బయటపెట్టడంతో ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యాడు. ఇక ఇటీవల రామ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు.

రెడ్ పై ఫుల్ కాన్ఫిడెన్స్
రామ్ నటించిన రెడ్ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుందని ఏ మాత్రం డిసప్పాయింట్ చేయదని కూడా అన్నాడు. రామ్ సినిమాలు చేస్తున్నాడు కానీ మిగతా హీరోల్లోగా వెంటవెంటనే సినిమాలను ఎనౌన్స్ చేయడం లేదు. కాస్త నెమ్మదిగానే వెళుతున్నాడని కామెంట్స్ వస్తున్నాయి.అయితే ఆ విషయంపై రామ్ వివరణ ఇచ్చాడు.

మెస్సేజ్ పెడితే పది సినిమాలు
అలాగే తన భవిష్యత్తు ప్రాజెక్టులపై క్లారిటీ ఇస్తూ నెమ్మదిగా కథలు ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా చెప్పాడు. రామ్ మాట్లాడుతూ.. నేను వేగంగా సినిమాలు చేయకపోవడానికి పెద్దగా రీజన్ ఏమిలేదు. నేను ఎంచుకున్న కథ కొత్తగా అనిపించాలి. అంతా సెట్టయ్యేకే రంగంలోకి దిగడం ఉంటుంది. సినిమాలను ఎనౌన్స్ చేయడం పెద్దగా టైమ్ పట్టదు. మెస్సేజ్ పెడితే పది సినిమాలు స్టార్ట్ అవుతాయి.
Kingfisher Calendar 2021 Superhot Model Photos

డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు
ప్రస్తుతం మూడు నాలుగు కథలైతే సిద్ధంగా ఉన్నాయి. అవి తొందరపడి సెలెక్ట్ చేసుకున్నవి కావు. ఒకవేళ నేను గ్యాప్ లేకుండా పది సినిమాలు ఓకే చేస్తే ఆ పాత్రలను ఆస్వాదించే టైమ్ ఉండదు. ఏ పాత్ర చేసినా కూడా ముందు దానికి బాగా కనెక్ట్ అవ్వాలి అనుకుంటాను. డబ్బు కోసం, పేరు కోసం, నెంబర్ కోసం సినిమాలు చేసే రకం కాదు నేను. సినిమా అంటే నాకు ఒక ఫ్యాషన్.. అని రామ్ తెలిపాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో..
ఇక నెక్స్ట్ నాలుగు సినిమాలతో పాటు త్రివిక్రమ్ తో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పాడు రామ్. ఆ మద్య మాట్లాడుకున్నాం అంటూ త్వరలోనే మా కాంబినేషన్ లో సినిమా ఉంటుందని, అయితే ఎప్పుడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. ఇక రెడ్ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఆ సినిమా తమిళ్ తడమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











