Boyapati Rapo Skanda: ఎన్టీఆర్‌ను కాపీ కొట్టిన రామ్... ఆ రెండు సాంగ్స్ డిట్టో దింపేశారుగా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం... స్కంధ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంటి తాజాగా ఓ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో రామ్ స్టేప్పులు ఎన్టీఆర్ సినిమా సాంగ్స్ లోని స్టేప్పులను పోలి ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
17 ఏళ్ల వయసులోనే దేవదాసు చిత్రంతో రామ్ పోతినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ హీరోకు వరుస అవకాశాలు వచ్చాయి. యువతకు నచ్చే చిత్రాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరించాడు. ఇక రామ్ డ్యాన్స్, ఎనర్జీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. లుక్స్ పరంగా కూడా రామ్ కు ఫుల్ క్రేజ్ ఉంది.

ఇక రామ్, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం స్కంధ. ఇక ఈ సినిమాలో రామ్ సరసన టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ఇక రామ్ పక్కన తొలిసారిగా ఈ భామ నటిస్తోంది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రబృందం ప్రమోషన్స్ ను మోదలు పెట్టింది.
ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఫాస్ట్ బీట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ అయితే వినేందుకు ఆకట్టుకునేలా ఉంది. తమన్ అందించిన సంగీతం అల్టీమేట్ ఉందని చెప్పవచ్చు. ఆ మ్యూజిక్ బీట్స్ కు బాడీలో పూనకాలు వచ్చేలా ఉన్నాయి. ఇక అంతే రిచ్ లుక్ తో.. సాంగ్ కనిపిస్తుంది. దానికి తోడు రామ్, శ్రీలీల కెమిస్ట్రీ అదిరిపోయిందని చెప్పవచ్చు.

అయితే ఈ పాట గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. పాట, ట్యూన్ అంతా బాగున్నా కానీ.. రామ్ స్టేప్పులపై కామెంట్స్ వస్తున్నాయి. రామ్ స్టేప్స్.. ఎన్టీఆర్ స్టేప్స్ ను పోలి ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రామ్ పోతినేని వేసిన స్టేప్స్... ఇంతకు ముందు ఎన్టీఆర్ నటించిన యమదొంగలో నా చొరే, నా చొరే సాంగ్ లోని స్టేప్స్ లాగా అనిపిస్తున్నాయి.
అంతే కాదు మరోవైపు జై లవకుశ సినిమాలోని ట్రింగ్ ట్రింగ్ సాంగ్ లోని స్టేప్స్ ను రామ్ పోతినేని దింపేశాడు అని చెప్పవచ్చు. దీనితో రామ్.. ఎన్టీఆర్ ను కాపీ కొట్టాడు అంటున్నారు. ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే.. శ్రీలీల ఈ పాటలో హాట్ గా కనిపించింది. అంతే కాదు.. బాడీని స్ప్రింగ్ లా తిప్పేస్తూ.. డాన్సులు చేసింది. రామ్ ఎనర్జికి తగ్గట్లుగానే... శ్రీలీల కూడా అదరగొట్టింది.


Click it and Unblock the Notifications











