Sreeleela రిలేషన్‌షిప్‌లో శ్రీలీల.. సీక్రెట్‌ను బయటపెట్టిన రామ్ పోతినేని.. ఉస్తాద్‌కు బ్రేకప్ జరిగిందా?
ఉస్తాద్ రామ్ పోతినేని, గ్లామర్ క్వీన్ శ్రీలీల, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం స్కంద. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా పవన్ కుమార్ సమర్పణలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లింప్స్, ట్రైలర్, టీజర్లు భారీ అంచనాలు పెంచాయి. ఇక ప్రమోషనల్ కార్యక్రమాలు ఈ సినిమాపై బజ్‌ను మరింత పెంచాయి. ఈ క్రమంలో సుమతో నిర్వహించిన ఇంటర్వ్యూలో రామ్, శ్రీలీల చేసిన అల్లరి వైరల్ అవుతున్నది. ఈ ఇంటర్వ్యూలో శ్రీలీలను రామ్ ఆటపట్టించిన విధానం ఎలా ఉందంటే?
రామ్ లీల అంటూ డిజైన్ చేసిన ప్రొగ్రాంలో రామ్, శ్రీలీల చేసిన అల్లరి, ఫన్ సరదాగా సాగింది. నేను సినిమాను ప్రమోషన్స్ చేయడానికి చాలా సీదా సాదాగా వస్తే.. శ్రీలీల మాత్రం తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చినట్టు ఉంది. ఆమె బిజీగా ఉంటూ కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌కు మంచి ఎనర్జీని ఇచ్చిందని రామ్ చెప్పారు.

షూటింగ్ లేకపోతే మీరు ఏం చేస్తారనే ప్రశ్నకు.. రామ్‌కు షూటింగ్ లేకపోతే.. ఇంట్లోనే ఉంటూ రిలాక్స్ అవుతుంటాడు. కాఫీలు తాగుతూ టైమ్‌ను ఎంజాయ్ చేస్తాడని శ్రీలీల చెప్పింది. ఇక శ్రీలీలకు షూటింగ్ లేకపోతే ఏం చేస్తుందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. శ్రీలీలకు షూటింగ్ లేకపోతే ఇండస్ట్రీ స్ట్రైక్‌లో ఉండి ఉంటుంది. లేదా కరోనా లాంటిదేదైనా వచ్చి ఉంటుంది. అప్పుడే శ్రీలీలకు షూటింగ్ లేకుండా ఉంటుందని రామ్ సెటైర్ వేశారు.

మీ ఇద్దరిలో ఎవరికైనా బ్రేకప్ జరిగిందా అనే ప్రశ్నకు రామ్ వెంటనే నాకు బ్రేకప్ జరిగింది అంటూ ప్లకార్డు ప్రదర్శించాడు. అయితే శ్రీలీల బ్రేకప్ జరుగలేదు.. అని సమాధానం చెప్పింది. దాంతో అవును శ్రీలీలకు బ్రేక్ జరుగలేదు. ఆమె రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇంకా బ్రేకప్ జరగలేదని అందుకే చెప్పింాది అని రామ్ ఆటపట్టించారు.
అయితే రామ్ ఆట పట్టిస్తుంటే.. నేను రిలేషన్‌షిప్‌లో లేను. అలాగని బ్రేకప్ కూడా జరగలేదు. రిలేషన్‌షిప్‌లో ఉండే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి అవకాశం వస్తే రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తాను అని శ్రీలీల చెప్పింది. ఇలా రామ్, శ్రీలీల తమ బ్రేకప్స్, అఫైర్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడుకొన్నారు.

వరుస హిట్లతో రామ్, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రీలీల స్కంద సినిమా కోసం కలిసి పనిచేశారు. ఇప్పటికే వీరిద్దరూ చేసిన పాటలు సోషల్ మీడియా, యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌గా నిలిచాయి. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేస్తున్నది.


Click it and Unblock the Notifications











