twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి రేసులో రెడ్ మూవీ.. మాస్, క్లాస్‌తో రామ్ పోతినేని రెడీ

    |

    కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ కుదేలైపోయింది. తెలుగు సినిమా పరిశ్రమలో పలు చిత్రాల వాయిదా పడటం నిర్మాతలకు ఆందోళనకరంగా మారాయి. నష్టాలను భరించలేని నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీపై రిలీజ్ చేసుకొన్నారు. కానీ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ మాత్రం థియేటర్లలో ప్రేక్షకుల కోసమే ఎదురుచూస్తున్నది. ప్రేక్షకులకు థియేటర్లో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇవ్వడానికి రామ్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే రెడ్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

    సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్‌' తర్వాత రామ్‌ పోతినేని హీరోగా నటించిన చిత్రం రెడ్ . కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కానుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

    Hero Ram Pothinenis Red movie getting ready for Sankranti

    ఈ సందర్భంగా స్రవంతి' రవికిషోర్ మాట్లాడుతూ రెడ్ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. స్రవంతి మూవీస్‌లో రామ్‌తో చాలా మంచి సినిమాలు చేశాం. ఇదీ మరో మంచి సినిమా అవుతుంది. మణిశర్మ తొలిసారిగా మా సంస్థ లో పని చేసి మంచి మ్యూజిక్‌ను అందించారు. రెడ్ చిత్రం స‌స్పెన్స్, క్రైమ్, థ్రిల్ల‌ర్, అంతేకాకుండా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని తెలిపారు. ఆద్యంతం ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. కేవ‌లం క్రైమ్ ఎలిమెంట్ మాత్ర‌మే కాదు.. ఇందులో చ‌క్క‌ని ల‌వ్ స్టోరి ఉంది. మ‌ద‌ర్ సెంటిమెంట్.. ఎంట‌ర్ టైన్ మెంట్ హైలైట్ గా నిలుస్తాయి.'' అని తెలిపారు.

    హీరో రామ్‌ మాట్లాడుతూ నా కెరీర్‌లో 18వ సినిమా రెడ్‌. కిషోర్ దర్శకత్వంలో నాకిది మూడో సినిమా. ఫస్ట్‌ టైమ్‌ కెరీర్‌లో ఒక థ్రిల్లర్‌ చేశాను. మాస్‌ ఎలిమెంట్స్‌, క్లాస్‌ఎలిమెంట్స్‌ అన్నీ ఉంటాయి అని చెప్పారు.

    Hero Ram Pothinenis Red movie getting ready for Sankranti

    కిషోర్ తిరుమల మాట్లాడుతూ హీరో రామ్‌తో స్రవంతి మూవీస్‌లో నేను చేసిన మూడో సినిమా ఇది. రెడ్‌ సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతున్నా. కథ కొత్తగా ఉంటుంది. ట్రీట్‌మెంట్‌ కూడా కొత్తగా ఉంటుంది. ఇది థ్రిల్లర్‌ అయినప్పటికీ కమర్షియల్‌గా ఉంటుంది అని అన్నారు.

    నటీనటులు: రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ , నాజ‌ర్ తదితరులు
    సంగీతం: మణిశర్మ
    ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి
    ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్
    ఫైట్స్: పీటర్‌ హెయిన్స్
    ఎడిటింగ్‌: జునైద్‌
    సమర్పణ: కృష్ణ పోతినేని
    నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్‌
    దర్శకత్వం: కిశోర్‌ తిరుమల

    English summary
    Energetic Hero Ram Pothineni’s much awaited next ‘RED’ to have a Grand Release for Sankranthi, only in Theaters. Directed by Kishore Tirumala, this intriguing flick is bankrolled by Sravanthi Ravi Kishore in Sri Sravanthi Movies banner. Revealing the insights, Producer Sravanthi Ravi Kishore says, “ We’re all set to release RED in Theatres, this Sankranthi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X