అల్లు అర్జున్‌తో చేయాలనుకున్న కథలో రామ్ పోతినేని.. తమిళ దర్శకుడితో బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్
చాక్లెట్ బాయ్ నుంచి ఉస్తాద్ స్టార్ గా తన మాస్ బ్రాండ్ ను మార్చుకున్న రామ్ పోతినేని ఈ మధ్య కాలంలో డిఫరెంట్ యాంగిల్ లో కనిపిస్తున్నాడు. సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధిని కూడా పెంచుకుంటున్నాడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా స్పీడ్ గా సినిమాలు చేస్తున్న రామ్ సంక్రాంతికి రెడ్ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ ఈ హీరో ఒక తమిళ్ హీరోతో వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా అల్లు అర్జున్ తో చేయాలనుకున్న బిగ్ బడ్జెట్ మూవీ అని టాక్ వస్తోంది.

రామ్ అసలు రంగును బయటపెట్టిన పూరి
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ఊర మాస్ లుక్ లో బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అంతకుముందు వరకు కూడా రామ్ పోతినేనిలో అసలైన మాస్ యాంగిల్ ను ఎవరు చూపించలేదు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం తన స్టైల్ లో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఆ సినిమాతో రామ్ కూడా పర్ఫాక్ట్ మాస్ హీరో అని ఋజువయ్యింది. ఇక రెడ్ సినిమాలో కూడా కొంత ఆ భావాలను చూపించాడు.

రెడ్.. అందించిన ప్రాఫిట్స్
రెడ్ సినిమాలో రామ్ రెండు ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. తమిళ్ తడమ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 5కోట్లకు పైగా ప్రాఫిట్స్ అంధించి సుపర్ హిట్ గా నిలిచింది. కిషోర్ తిరుమల ఆ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి మరో మంచి హిట్ అందుకోవడంతో రామ్ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్న కథలో..
ఇక రామ్ పోతినేని రెడ్ సినిమాలో డ్యూయల్ రోల్స్ తో మెప్పించగా ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో ఒక ఊర మాస్ లుక్కుతో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమాను కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామితో తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఆ సినిమాను మొదట అల్లు అర్జున్ తో చేయాలని ఆ దర్శకుడు ఎన్నో ఏళ్ళ కిందట అనుకున్నాడట. 8 ఏళ్ల కిందట ఆ కాంబోపై రూమర్స్ చాలానే వచ్చాయి కానీ వర్కౌట్ కాలేదు.
Recommended Video

కథలో కొన్ని మార్పులు చేసి..
ఇక ఇప్పుడు లింగుస్వామి ఆ కథలో కొన్ని మార్పులు చేసి రామ్ ను ఊర మాస్ లుక్కుతో చూపించే ఛాన్స్ ఉందట. ఆ సినిమా కథకు తగ్గట్లు డిఫరెంట్ షేడ్స్ నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు రామ్. ఆ స్క్రిప్ట్ పై మనసు పారేసుకున్న రామ్ ఎలాగైనా ఈ ఏడాదిలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం శివమాలలో ఉన్న రామ్ దీక్ష పూర్తయిన తరువాత కొత్త ప్రాజెక్ట్ తో బిజీ కానున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











