తాడం రీమేక్‌లో రామ్.. ఫ్యానీ రేటుకు స్రవంతి మూవీస్‌కి హక్కులు

తమిళంలో అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయంతో వచ్చిన తాడం చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం టాలీవుడ్ నిర్మాతలు భారీగా పోటీపడ్డారు. అయితే ఈ చిత్ర రీమేక్ హక్కులను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్, అధినేత స్రవంతి రవికిషోర్, ప్రముఖ నిర్మాత టాగోర్ మధు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్నారు.

తమిళంలో అరుణ్ విజయ్ పోషించిన పాత్రను తన సొంత నిర్మాణ సంస్థలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసే అవకాశం పుష్కలంగా ఉంది. ఒకవేళ రామ్ చేయలేని పరిస్థితుల్లో మరో హీరోను రంగంలోకి దించాలని రవికిషోర్, టాగోర్ మధు ఆలోచనలో ఉన్నారు. మార్చి చివరివారంలో ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతికవర్గం వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది అని ప్రముఖ పీఆర్వో పులగం చిన్నారాయణ ట్వీట్ చేశారు.

Hero Ram in Thadam remake

తమిళంలో అరుణ్ విజయ్, తన్యా హోప్, యోగిబాబు, స్మృతి వెంకట్, విద్యా ప్రదీప్ తదితరులు నటించారు. అరుణ్ విజయ్ బిజినెస్ మెన్‌గా, జనాన్ని మోసం చేసే దొంగ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి మగీజ్ తిరుమెనీ దర్శకుడు. మార్చి 1న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలకు నోచుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది.

ప్రస్తుతం హీరో రామ్ పూరీ కనెక్ట్ రూపొందించే ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకుడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా తర్వాత రామ్ తాడం రీమేక్‌తోపాటు ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్‌లో నటించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X