అంతకు మించి ముందుకు జరగలేదు.. పెళ్లిపై మొదటిసారి క్లారిటి ఇచ్చిన సాయి ధరమ్ తేజ్
మూడు పదుల వయసులోకి వస్తున్నా కూడా కొందరు హీరోలు అస్సలు పెళ్లి చేసుకోవడం లేదు. ఇక మొన్న లాక్ డౌన్ లో వరుస పెట్టి నిఖిల్, నితిన్, రానా పెళ్లి చేసుకోవడంతో మిగతా హీరోల పెళ్లిపై కూడా రూమర్స్ వచ్చాయి. 30లో ఉన్న హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. ముఖ్యంగా మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వచ్చింది. ఇక ఇటీవల మొదటిసారి సాయి ధరమ్ తేజ్ తన పెళ్లి వార్తలపై ఒక క్లారిటీ ఇచ్చాడు.
Recommended Video

పెళ్లి వార్తలు కొత్తేమి కాదు
సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై వార్తలు రావడం కొత్తేమి కాదు. గత రెండేళ్ల నుంచి వస్తూనే ఉన్నాయి. ఒకసారి తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ రాగా మరోసారి తన బంధువుల అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని కూడా టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అప్పట్లో ఈ హీరో చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి సుప్రీమ్ హీరో పెళ్లి రూమర్స్ హాట్ టాపిక్ గా మారాయి.

నిహారిక పెళ్లి తరువాత...
మెగాస్టార్ చూసిన ఒక సంబందం సాయికి ఫిక్స్ చేసినట్లు అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే నాగబాబు కూతురు నిహారిక వివాహం తరువాత సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై క్లారిటీ ఇవ్వాలని అనుకున్నారట. అందుకే ఫిక్స్ అయినప్పటికీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదని కుడా రూమర్స్ వచ్చాయి. ఇక ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని సాయి ఇటీవల వివరణ ఇచ్చాడు.

సాయి ధరమ్ తేజ్ ఏమన్నాడంటే..
నేను ఇంకా పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కాలేదు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళకు ఇష్టం ఉంటే సంబంధాలు చూడమని మాత్రమే చెప్పాను. కానీ ఇంకా అమ్మాయి ఫిక్స్ కాలేదు. అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకి జరగలేదు. అంతే గాని పెళ్లి సంబంధం ఫిక్స్ అయ్యిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనవసరంగా మీడియానే ఈ విషయాన్ని హైలెట్ చేసినట్లు సాయి ధరమ్ తేజ్ చెప్పాడు.

ఇంట్లో వాళ్ళు మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యారు
అదే విధంగా ఇప్పుడైతే తనకు పెళ్లి చేసుకోవడంపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెబుతూ ఇంట్లో వాళ్ళు అమ్మాయి బాగుందని పెళ్లి సంభంధం తీసుకొస్తే మాత్రం అప్పుడు ఆలోచిస్తానని చెప్పాడు. ఫైనల్ గా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యారని కూడా సాయి నవ్వుతూ వివరణ ఇచ్చాడు. ఇక ఈ హీరో గత ఏడాది ప్రతి రోజు పండగే సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. నెక్స్ట్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో కూడా అలాంటి హిట్టే అందుకోవాలని చూస్తున్న ఈ మెగా మేనల్లుడు త్వరలో దేవకట్టాతో ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











