Sai Dharam Tej: సాయ్ ధరమ్ తేజ్ భారీ సాయం! మెగా మేనల్లుడు అనిపించుకున్నాడు..
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీలో పుట్టినప్పటికీ ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తారు. అలాగే పది మందికి సాయం చేసే గుణం కూడా మేన మానల నుంచే అలవడింది ఈ యంగ్ హీరోకి. అలాగే ఎవరికైనా సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటాడు సాయి ధరమ్ తేజ్. అయితే అక్టోబర్ 15వ తేదీ అంటే ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగానే ఆయన ఓ మంచి ఆలోచన చేశారు.
తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సాయి ధరమ్ తేజ్ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. అందులో తాను చేయబోతున్న మంచి పని గురించి వివరించాడు. ఇది నా హీరోల కోసం... మనమంతా ఇక్కడ ఏదో ఒక మార్పు తీసుకొచ్చేందుకే వచ్చామంటూ రాసుకొచ్చాడు. అలాగే తాను కూడా మరో సంవత్సరం ముందుకు వెళ్తున్నందుకు.. తన మనసుకు దగ్గరైన ఒక మార్పును చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా 10 లక్షల రూపాయలను వీరనారీలకు అంటే ఆర్మీలో ఉంటూ మన భవిష్యత్తు కోసం వారి నేటిని త్యాగం చేస్తూ.. మరణించిన సైనికుల భార్యలకు విరాళంగా ఇస్తానని మాటిస్తున్నట్లు వెల్లడించాడు.

అలాగే మరో పది లక్షల రూపాయలను ప్రతీరోజు రక్షణ కోసం కష్టపడుతున్న బాధ్యతగల ఏపీ, తెలంగాణ పోలీసులకు విరాళంగా ఇస్తున్నానంటూ తాన చేస్తున్న మంచి పని గురించి అభిమానులకు తెలియజెప్పాడు. అంతే కాకుండా తాను తీసుకున్న ఈ నిర్ణయంలో మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నానని.. అది మీ విరాళాల రూపంలో మాత్రం కాదని స్పష్టం చేశాడు. సైనికులు, ఆర్మీ, పోలీసులు, మనకోసం చేస్తున్న పనికి వారిపై అభిమానం, గౌరవం చూపించాలంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పిన మాట నెటిజెన్లను మరింత ఎక్కువగా ఆకట్టుకుంది. తనలాగే ఇతరులు కూడా పోలీసులు, సైనికులకు... మర్యాద, గౌరవం ఇస్తే బాగుంటుందని వివరించాడు.
సాయి ధరమ్ తేజ్ తన బాధ్యతను మెరుగు పరుచుకుంటున్నానని.. మన భవిష్యత్తుకు కోసం వారి పోలీసులు, ఆర్మీ జవాన్లు చేస్తున్న త్యాగాలపై గౌరవంతోనే ఈ పని చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇండియన్ ఆర్మీతో పాటు తెలంగాణ, ఏపీ పోలీసులకు ధన్యవాదాలు అంటూ ముగించాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెట్టిన ఈ పోస్టుకు అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారని, మెగా మేనల్లుడు అనిపించుకున్నారని అంటున్నారు. అలాగే మేనమామలను చూసే మంచి పనులు చేయడం అలవరుచుకున్నారు అంటూ మెగా అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఇటీవలే విరూపాక్ష సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన సాయి ధరమ్ తేజ్ చాలా ఎగ్జైంటింగ్ మరో సినిమా చేస్తున్నాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన తర్వాతి మూవీ గాంజా శంకర్ నుండి గ్లింప్స్ విడుదల చేసింది సినీ బృందం. మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్టవుతుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











