Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విజయ నిర్మల అరుదైన ఆల్ రౌండర్.. శర్వానంద్
దర్శకురాలు, నటి, నిర్మాత విజయ నిర్మల మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఆమె మృతికి యువ హీరో శర్వానంద్ స్పందించారు. 'తెలుగు సినిమా ఇండస్ట్రీని దిశానిర్దేశం చేసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో విజయనిర్మలగారు ఒకరు. తెలుగు సినిమాపై నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆమె ప్రభావం ఎంతో ఉంది. ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. ప్రపంచంలోనే 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలు. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించి తెలుగు సినిమాకే గర్వకారణంగా నిలిచారు' అని శర్వానంద్ సంతాపం వ్యక్తం చేశారు.
మహిళల్లో ఆమె లాంటి ఆల్ రౌండర్స్ అరుదు. ఇలాంటి వారిని ఇక చూడలేం. విజయ నిర్మలగారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. కృష్ణగారికి, నరేశ్‌గారికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని యువ హీరో శర్వానంద్ సంతాప ప్రకటనను విడుదల చేశారు.
కాగా, విజయ నిర్మల గారి అంతిమ యాత్ర శుక్రవారం ఉదయం 8 గంటలకు నానక్‌రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయి అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.