twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ నిర్మల అరుదైన ఆల్ రౌండర్.. శర్వానంద్

    |

    దర్శకురాలు, నటి, నిర్మాత విజయ నిర్మల మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఆమె మృతికి యువ హీరో శర్వానంద్ స్పందించారు. 'తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని దిశానిర్దేశం చేసిన అతి కొద్ది మంది వ్య‌క్తుల్లో విజ‌య‌నిర్మ‌ల‌గారు ఒక‌రు. తెలుగు సినిమాపై న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా ఆమె ప్ర‌భావం ఎంతో ఉంది. ఆమె ప్ర‌యాణం ఎంతో మందికి స్ఫూర్తి దాయ‌కం. ప్ర‌ప‌ంచంలోనే 44 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏకైక మ‌హిళా ద‌ర్శ‌కురాలు. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించి తెలుగు సినిమాకే గ‌ర్వ‌కార‌ణంగా నిలిచారు' అని శర్వానంద్ సంతాపం వ్యక్తం చేశారు.

    మ‌హిళ‌ల్లో ఆమె లాంటి ఆల్ రౌండ‌ర్స్ అరుదు. ఇలాంటి వారిని ఇక చూడ‌లేం. విజ‌య నిర్మ‌ల‌గారి మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి. కృష్ణ‌గారికి, న‌రేశ్‌గారికి ఆ భ‌గ‌వంతుడు మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాలి అని యువ హీరో శర్వానంద్ సంతాప ప్రకటనను విడుదల చేశారు.

    Hero Sharwanand on Vijaya Niramala death

    కాగా, విజయ నిర్మల గారి అంతిమ యాత్ర శుక్రవారం ఉదయం 8 గంటలకు నానక్‌రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయి అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

    English summary
    Actor, director, Super Star Krishna wife Vijaya Nirmala passed away on June 26th midnight in Hyderabad. She was 73 and she breathed her last in Continental Hospitals in Gachibowli. Vijaya Niramala last rites will be on June 28th. In this occassion, AP CM YS Jagan condolenced on her demise.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X