సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకొన్న హీరో సిద్దార్థ్, అదితిరావు.. తెలంగాణలో ఎక్కడ? ఎప్పుడంటే?
దక్షిణాదిలో స్టార్ హీరో సిద్దార్థ్, బాలీవుడ్ హీరోయిన్ అదితిరావు హైదరీ గత కొద్దికాలంగా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యవహారం జాతీయ మీడియాలో హైలెట్‌గా మారింది. వారిద్దరూ కొంతకాలంగా కలిసి మెలిసి తిరగడం, ముంబై వీధుల్లో అన్యోన్యంగా ఉంటూ కనిపించడంతో వారిద్దరి డేటింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే వారిద్దరి మీడియాకు భయపడకుండా స్వేచ్ఛగా తిరుగుతూ తమ ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వారిద్దరి పెళ్లి వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీకి గతంలో వివాహం జరిగింది. వారిద్దరూ తమ మ్యారేజ్ బ్రేకప్ చేసుకొని జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చారు. చాలా సంవత్సరాలుగా వీరిద్దరూ కూడా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కాలంలో వారిద్దరికి ఇతరులతో అఫైర్ వార్తలు వచ్చాయి. కానీ మీడియాలో ఎక్కువ కాలం నిలబడలేదనేది గమనార్హం.

హీరో సిద్దార్థ్‌కు గతంలో మేఘన అనే యువతితో 2003 లో వివాహం జరిగింది. ఆ తర్వాత వారిద్దరి దాంపత్య జీవితం 2007 వరకు కొనసాగింది. దాంపత్య జీవితంలో విభేదాలు రావడంతో 2007 సంవత్సరంలో వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత సమంతతో ఆయన బంధం పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ సోహా ఆలీ ఖాన్‌తో కూడా అలాంటి పరిస్థితే కొనసాగింది.
అాదితిరావు హైదరీ విషయానికి వస్తే.. నటుడు, లాయర్ సత్యదీప్ మిశ్రాను 2022 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. సుమారుగా 2021లో వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఒంటరి జీవితం గడుపుతున్న ఆమెకు గతంలో బాలీవుడ్ హీరోలతో అఫైర్ ఉన్నట్టు వచ్చాయి. కానీ కొంతకాలం తర్వాత వాటి గురించి ప్రస్తావన మీడియాలో కనిపించలేదు.
ఇక అదితిరావు హైదరీ అడపదడపా తెలుగు సినీ పరిశ్రమలో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నది. ఆమె నటించిన సమ్మోహనం సినిమా హిట్ కావడంతో తెలుగు, తమిళం, మలయాళంలో మంచి అవకాశాలు వచ్చాయి. అదితి, సిద్దార్థ్ ఇద్దరు కలిసి మహా సముద్రం అనే సినిమాలో నటించారు. అప్పుడే వారిద్దరి మధ్య పరిచయం జరిగింది.

అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మహా సముద్రం సినిమా షూటింగ్ సమయంలో అదితి, సిద్దార్థ్ మధ్య బంధం బలపడింది. వారి పరిచయం సహజీవనం వరకు దారి తీసింది. అయితే కొద్దికాలంగా వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ వాటిపై ఆ ఇద్దరు పెద్దగా స్పందించలేదు. కానీ వారిద్దరూ మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ పుణ్యక్షేత్రంలో వివాహం చేసుకొన్నట్టు వార్తలు వచ్చాయి.
తాజా వార్తల ప్రకారం.. అదితి, సిద్దార్థ్ ఇద్దరు వనపర్తిలో వివాహం చేసుకొన్నారు. ప్రసిద్ద శ్రీరంగాపురం ఆలయం వారి పెళ్లి జరిగింది. అయితే అతికొద్ది మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. ఇరు కుటుంబాల సమక్షంలో వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు అని తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో గందరగోళం నెలకొన్నది. అయితే అధికారికంగా వారిద్దరూ తమ పెళ్లి వార్తను అందిస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, అదితి రావు హైదరీ కుటుంబం వనపర్తి సంస్థానానికి చెందిన వారు కావడం తెలిసిందే. ప్రముఖ విద్యావేత్త రాజా రామేశ్వరరావు మనవరాలు తెలిసిందే.


Click it and Unblock the Notifications











