Engagement అదితిరావు హైదరీతో సీక్రెట్‌గా ఆ కార్యక్రమం.. ఘాటుగా స్పందించిన సిద్దార్థ్
తెలుగు సినిమా రంగంలోనే కాకుండా జాతీయ మీడియా హెడ్‌లైన్స్‌ను అదితిరావు, సిద్దార్థ్ ఎంగేజ్‌మెంట్ వార్త విశేషంగా ఆకర్షించింది. వారిద్దరి నిశ్చితార్థం వార్త సోషల్ మీడియాను, నేషనల్ మీడియాను కుదిపేసింది. తొలుత వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకొంటున్నారనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. అయితే అదితి, సిద్దార్థ్ చేసుకొన్న వివాహం కాదు.. నిశ్చితార్థం అని తేలడం ఈ వార్తలో ఓ ట్విస్టు. అయితే తమ నిశ్చితార్థం గురించి సిద్దార్థ్ క్లారిటీ ఇస్తూ..
తెలుగులో సమ్మోహనం సినిమా తర్వాత అదితిరావు నటించిన చిత్రం మహాసముద్రం. ఆ చిత్ర షూటింగులో సిద్దార్థ్, అదితికి జరిగిన పరిచయం ఆ తర్వాత అఫైర్‌కు, అనంతరం సహజీవనానికి దారి తీసింది. ఇటీవల కాలంలో వారిద్దరూ ముంబైలో పలుచోట్ల మీడియాకు చిక్కడంతో వారిద్దరి డేటింగ్ అధికార ముద్ర పడింది.

గతవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రస్తుత వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలోని శ్రీ రంగాపురంలోని శ్రీ రంగనాయక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొన్నారనే వార్త వైరల్ అయింది. అయితే వారిద్దరి వివాహం జరగలేదనే విషయం అదితిరావు హైదరీ ఇన్స్‌టాగ్రామ్ పోస్టుతో స్పష్టమైంది.
పెళ్లి వార్తల గోల నేపథ్యంలో ఓ రోజు తర్వాత అదితి రావు హైదరీ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. మా ఇద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది అని ఓ ఫోటోను షేర్ చేసింది. దాంతో జరిగింది వారి వివాహం కాదు.. నిశ్చితార్థం అనే విషయం ప్రపంచానికి తెలిసింది.

అయితే తాము సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకొన్నామనే విషయాన్ని హీరో సిద్దార్థ్ ఖండించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. చాలా మంది మేము సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొన్నామని అనుకొంటున్నారు. సీక్రెట్‌కు, ప్రైవేట్ ఫ్యామిలీ ఫంక్షన్‌కు తేడా ఉంది. ఎవరినైతే ఆహ్వానించలేదో వారు సీక్రెట్ అని అంటున్నారు. ఎవరికైతే ఆహ్వానాలు అంది హాజరయ్యారో వారు ప్రైవేట్ ఫ్యామీలీ కార్యక్రమం అని అనుకొంటున్నారు అని సిద్దార్ అన్నాడు.
మా ఎంగేజ్‌మెంట్, మా బంధం గురించి ఎవరేమనుకొన్నా నాకు పెద్దగా పట్టించుకోను. ఆమె (అదితి) ఒప్పుకొన్నది. అదే నాకు ముఖ్యం. ఎంత కాలానికి ఆమె ఒప్పుకొన్నదనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఒప్పుకొన్నారా? లేదా? పాస్ లేదా ఫెయిల్ అనే విషయాన్ని పట్టించుకోను. ఆమె ఒప్పుకోవడమే నేను పాస్ అయ్యానని అనుకొంటాను. ఇరు కుటుంబాలు మమ్మల్ని ఆశీర్వదించారు. అదే మాకు విజయం అని సిద్దార్థ్ అన్నారు.


Click it and Unblock the Notifications











