Hero Sivakarthikeyan: ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ను శివకార్తికేయన్ మోసం చేశాడా? అసలేం జరిగిందంటే?
ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ పూర్తి పేరు ఇమ్మాన్యుయేల్ వసంత్ దినకరన్. ఈయన ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాలకు సంగీతం అందించాడు. మంచి మంచి పాటలకు మ్యూజిక్ అందించి శ్రోతలను ఉర్రూతలూగించాడు. ముఖ్యంగా ప్రేమఖైది, గజరాజు వంటి తెలుగు చిత్రాలకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. మైనా, గుంకి లాంటి చిత్రాల్లో అతడి పాటలు వింటే ఎవరికైనా పిచ్చెక్కిపోవాల్సిందే. అలాగే అజిత్ విశ్వాసం సినిమాకు ఈయన అందించిన మ్యూజిక్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం కూడా వచ్చింది.
ఇంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈయన ఓ స్టార్ హీరో గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు. తనను ఓ హీరో మోసం చేశాడని, దాని గురించి నేరుగా ఆయనే వెళ్లి అతడిని అడగ్గా నోటికి వచ్చినట్లు మాట్లాడి తనను చాలా బాధ పెట్టాడని చెప్పుకొచ్చాడు. సినీ రంగంలో ఎవరి చిత్రాలకు అయినా పని చేసే ఇతడు.. ఆ హీరో సినిమాలకు మాత్రం అస్సలే పని చేయనని అంటున్నాడు. ఇంతకూ ఆ హీరో ఎవరు, ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ మాట్లాడింది మరెవరి గురించో కాదు స్టార్ డైరెక్టర్ శివకార్తికేయన్ గురించే. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబ నుంచి స్టార్ హీరోగా మారిన అతడిపై.. ఇమ్మాన్ చేసిన కామెంట్లు కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా శివకు పెద్ద బ్రేక్ ఇచ్చిన వరుత్త పడదా వాలిబర్ సంఘం సినిమాకు ఇమ్మాన్ యే సంగీతం అందించారు. ఇందులోని పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పటికీ ప్రేక్షకులు ఆ పాటలను వింటుంటారు.
అలాగే ఆ తర్వాత వచ్చి సూపర్ డూపర్ హిట్టు అయిన రజనీ మురుగున్ చిత్రానికి కూడా ఇమ్మాన్ యే సంగీత దర్శకుడిగా పని చేశారు. అయితే కొన్నేళ్ల నుంచి వీరిద్దరూ కలిసి పని చేయట్లేదు. దీని గురించే ఇమ్మాన్ ను ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హీరో శివకార్తికేయన్ తనకు చాలా పెద్ద ద్రోహం చేశాడని వివరించాడు. కానీ అతను చేసిన ద్రోహం గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదని పేర్కొన్నాడు.

శివకార్తికేయన్.. తనకు ఓ మాట ఇచ్చి మాట తప్పాడని ఇమ్మాన్ వెల్లడించాడు. తనకు చేసిన ద్రోహం గురించి వెళ్లి అడిగేత అతడు విచిత్రమైన సమాధానం చెప్పాడని, అతడు అన్న మాటలకు తన గుండె పగిలిందని స్పష్టం చేశాడు. కానీ తాను శివకార్తికేయన్ ను ఏమీ అనలేదని.. కాకపోతే ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి తాను అతడితో మాట్లాడడం మానేసినట్లు వివరించాడు. ఇక జీవితంలో ఆయన సినిమాలకు పని చేయనని తేల్చి చెప్పాడు. అలాగే ఆయన ముందుగానే ఒప్పుకున్న చిత్రాల్లో ఆయన హీరోగా ఉన్నారని తెలిసినా.. తాను ఆ సినిమా నుంచి తప్పుకుంటానని అన్నాడు.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. ఏదో పెద్ద ద్రోహం చేయడం వల్లే ఇమ్మాన్ మనసు విరిగిపోయి ఉంటుందని అనుకుంటున్నారు. ఇమ్మాన్ గుండె పగిలేలా శివకార్తికేయన్ ఏమన్నారో అని తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. మరి వీరిద్దరి మధ్యా ఏం జరిగిందో శివకార్తికేయన్ చెబితే తప్ప తెలిసేలా లేదు.


Click it and Unblock the Notifications











