For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శక్తిగా మారనున్న ‘హీరో’ శివ కార్తికేయ‌న్.. విద్యా వ్యవస్థపై విమర్శనాస్త్రంగా

  |

  విద్యావ్య‌వ‌స్థ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ శంక‌ర్ తెర‌కెక్కించిన జెంటిల్‌మేన్ చిత్రం గుర్తుకొస్తుంది. అందుకు ఏమాత్రం తీసిపోని క‌థ‌తో పి.య‌స్‌.మిత్ర‌న్ డైర‌క్ట్ చేసిన సినిమాశ‌క్తి. శివ కార్తికేయ‌న్ కెరీర్‌లో సామాజిక స్పృహ ఉన్న క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా రిజిస్టర్ అయింది ఈ మూవీ. కేజేఆర్ స్టూడియోస్‌, గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. కోటపాడి జె రాజేష్ ఈ చిత్రానికి నిర్మాత . క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ నాయిక‌. ఇవాన కీల‌క పాత్ర‌లో న‌టించారు.

  త‌మిళ, తెలుగు భాష‌ల్లో అభిమ‌న్యుడు చిత్రంతో స‌త్తా చాటిన ద‌ర్శ‌కుడు పీయ‌స్‌ మిత్ర‌న్‌. ఆయ‌న దర్శకత్వం వహించిన తాజా త‌మిళ మూవీ హీరో తెలుగులో శ‌క్తి పేరుతో విడుద‌ల కానుంది. డైనమిక్ స్టార్ శివ కార్తికేయ‌న్ ఇందులో హీరోగా న‌టించారు. యాక్షన్ కింగ్‌ అర్జున్ కీల‌క పాత్రధారి . బాలీవుడ్ న‌టుడు అభ‌య్ డియోల్‌కి సౌత్ ఇండియాలో తొలి సినిమా ఇదే.

  Hero Sivakarthikeyans hero dubbing as Shakti in Telugu

  డైర‌క్ట‌ర్ పీయ‌స్‌ మిత్ర‌న్ సినిమా గురించి మాట్లాడుతూ సూప‌ర్ హీరోల ప‌ట్ల మ‌న‌కుఎప్పుడూ విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది. శక్తిమాన్ సీరియ‌ల్‌ని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. ఆ సీరియ‌ల్ ప్రభావంతో సూప‌ర్‌మేన్ అవుదామ‌నుకున్న ఓ అబ్బాయి... రియ‌ల్ లైఫ్‌లో చేసిన స్టంట్లు ఏంటి? తండ్రి స‌ల‌హాతో లైఫ్‌లో ఎలా సెటిల‌య్యాడు? అత‌ను చేసిన సూప‌ర్‌మేన్ త‌ర‌హా ప‌నులేంటి? మ‌న విద్యావ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను అత‌నికి గుర్తు చేసిందెవ‌రు? అత‌ను బాగు చేసిందేంటి? లాంటి విష‌యాల‌న్నీ ఇందులోఆస‌క్తిక‌రంగా ఉంటాయి. త‌మిళంలో ఈ సినిమాకు చాలా మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. యూనివర్సల్ స‌బ్జెక్ట్ కావ‌డంతో తెలుగు ప్రేక్ష‌కులు కూడా అంతే ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను. ఈ క‌థ‌లో వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను చాలా చొప్పించాం. ప్రేక్ష‌కుల‌కు ఓ వైపు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని క‌లిగిస్తూనే ఆలోచింప‌జేసేలా ఉంటుందీ సినిమా అని చెప్పారు.

  నిర్మాత కోటపాడి జే రాజేష్ మాట్లాడుతూ శివ కార్తికేయ‌న్ ఒక సినిమాను అంగీక‌రించారంటేనే ఆ క‌థ‌లో క‌చ్చితంగా ఏదో ఒక బిగ్ పాయింట్ ఉంటుంద‌నే న‌మ్మ‌కంప్రేక్ష‌కుల్లో స్థిర‌ప‌డిపోయింది. అందుకే సినిమా సినిమాకూ ఆయ‌న మార్కెట్ పెరుగుతూఉంది. శివ కార్తికేయ‌న్ చేసిన హీరో మూవీ యూనివ‌ర్శ‌ల్ స‌బ్జెక్ట్ తో రూపొందింది. అందుకే తెలుగులో శ‌క్తి పేరుతో విడుద‌ల చేస్తున్నాం. అభిమ‌న్యుడు చిత్రం త‌ర్వాత పి.య‌స్‌.మిత్ర‌న్ డైర‌క్ట్ చేసిన సినిమా ఇది. అభిమ‌న్యుడు స‌క్సెస్‌లో భాగ‌మైన సంగీతద‌ర్శ‌కుడు యువ‌న్ శంక‌ర్ రాజా, ఎడిట‌ర్ రూబెన్‌, సినిమాటోగ్రాఫ‌ర్ జార్జి.జి.విలియ‌మ్స్ఈ చిత్రానికి కూడా ప‌నిచేశారు. సౌత్‌లో అభ‌య్ డియోల్ విల‌న్‌గా చేసిన తొలి సినిమా ఇది. మ‌న విద్యావ్య‌వ‌స్థ గురించి ఇందులో ఉన్న డైలాగులు అంద‌రినీ ఆలోచ‌న‌లో ప‌డేస్తాయి.

  Hero Sivakarthikeyans hero dubbing as Shakti in Telugu

  థియేట‌ర్లో సినిమా చూసిన త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల ప‌ట్ల ప్ర‌వ‌ర్తించే విధానంలోనూ త‌ప్ప‌క మార్పు వ‌స్తుంది. సృజ‌న‌కు విలువ ఇస్తే... సృజ‌నాత్మ‌కంగాఆలోచించేవారిని ప్రోత్సహిస్తే మ‌న భావిత‌రాలు ఎంత బావుంటాయో అంద‌రికీ అర్థం అయ్యేలా చెబుతుందీ స్క్రిప్ట్. అర్జున్ పాత్ర స‌ర్‌ప్రైజింగ్‌గా, ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంది. నిర్మాణానంతర కార్య‌క్ర‌మాలు పూర్తయ్యాయి. త్వ‌ర‌లోనే సెన్సార్కు వెళ్తున్నాం. ఈ నెల్లోనే పాట‌ల‌ను విడుద‌ల చేసి, సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం అని చెప్పారు.

  సాంకేతిక నిపుణులు:
  న‌టీన‌టులు: శివ‌కార్తికేయ‌న్‌, అర్జున్‌, అభ‌య్ డియోల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, ఇవానా త‌దిత‌రులు.
  ర‌చ‌న‌: పి.య‌స్‌.మిత్ర‌న్‌, పార్తిబ‌న్‌, స‌వారి ముత్తు, ఆంటోనీ భాగ్య‌రాజ్‌,
  సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా,
  కెమెరా: జార్జి.సి.విలియ‌మ్స్,
  ఎడిటింగ్‌: రూబెన్‌,
  మాట‌లు: రాజేష్ ఎ మూర్తి,
  పాటలు : రాజశ్రీ సుధాకర్.

  English summary
  Tamil Director PS Mitran' latest movie Hero is coming as Shakti movie in the Telugu Language. Sivakarthikeyan's hero becoming as Shakti in Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X