బ్రోచేవారెవరురా: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు హీరోగా త్వరలో 'బ్రోచేవారెవరురా' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి ''చలనమే చిత్రము.. చిత్రమే చలనము'' అనేది ట్యాగ్ లైన్. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈచిత్రంలోని పాత్రలను దర్శకుడు వినోదాత్మకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఎలాంటి గోల్ లేకుండా జులాయిగా తిరిగే పాత్రలో నటించారు. ఈజీ మనీ కోసం వీరు చేసే పనులు ప్రేక్షకులకు వినోదం పంచేలా మలిచినట్లు తెలుస్తోంది.
శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటిస్తుండగా సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
శ్రీవిష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, నివేదా పేతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ నిర్మాత: విజయ్ కుమార్ మన్యం బ్యానర్: మన్యం ప్రొడక్షన్స్ సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరాం ఎడిటర్: రవితేజ గిరిజాల.


Click it and Unblock the Notifications











