గల్లీలో కరెంట్ షాక్ తో భయపెట్టిన హీరో సుధీర్ బాబు.. నడి రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటూ..
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఒక వర్గం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునేలా ప్రయోగాలు చేస్తుంటాడు. సుధీర్ బాబు సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బెస్ కూడా ఉందని చెప్పవచ్చు. ఇక ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకోవాలని ఒక శ్రీదేవి సోడా సెంటర్ అనే మాస్ మసాలా యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. అందులోనే ఒక డిఫరెంట్ ఎమోషన్స్ ను కూడా చూపించబోతున్నాడు. ఇక రీసెంట్ గా ఈ హీరోకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో సుధీర్ బాబు కరెంట్ షాక్ కొట్టిన వ్యక్తిలా నడి రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటూ కనిపించాడు.

కేవలం హీరోగానే కాకుండా
హీరో సుధీర్ బాబుకు సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ ఉన్నప్పటికీ సొంతంగానే అవకశాలు అందుకుంటూ వస్తున్నాడు. ఎక్కువగా కొత్త దర్శకులతో వర్క్ చేస్తూ ప్రయోగాత్మకమైన కథలను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సుధీర్ బాబు నుంచి ఏదైనా సినిమా వచ్చింది అంటే అందులో ఏదో ఒక పాయింట్ చాలా కొత్తగా ఉంటుందని అభిమానులు ఒక నమ్మకం ఏర్పడింది. 2013 నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుధీర్ బాబు కేవలం హీరోగానే కాకుండా మధ్యమధ్యలో కొన్ని నెగిటివ్ రోల్స్ గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నాడు. అలాగే మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

ఆ సినిమా సక్సెస్ కాకపోయినా..
ప్రేమ కథ చిత్రం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే.. వంటి సినిమాలతో సుధీర్ బాబుకు బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపుని అందించాయి. గత ఏడాది వచ్చిన 'వి' సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోయినా కూడా సుధీర్ బాబు పాత్రకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది.

సుధీర్ బాబు ప్రాంక్
ఇక చాలా రోజుల తర్వాత సుధీర్ బాబు ఒక విభిన్నమైన ఎమోషనల్ వీడియో తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తన కొత్త సినిమా కోసం హైదరాబాద్ వీధుల్లో కరెంట్ షాక్ వచ్చిన వ్యక్తిలా కంగారు పెట్టె ప్రయత్నం చేశాడు. సాధారణ జనాలను కరెంట్ తీగ ను పట్టుకుని చెప్పి తనకు కరెంట్ షాక్ వచ్చింది అన్నట్లుగా రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నాడు. సుధీర్ బాబు కర్చీఫ్ కట్టుకొని ఆ ప్రాంక్ చేయడంతో మొదట ఎవరు గుర్తు పట్టలేకపోయారు.

సినిమా కోసం మొదటి ప్రాంక్
ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తో కలిసి చేసిన ఆ ప్రాంక్ వీడియో బాగానే ఉపయోగపడింది. సుధీర్ బాబు చేసిన మొదటి ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. సుధీర్ బాబు నటించిన కొత్త సినిమా శ్రీదేవి శ్రీదేవి సోడా సెంటర్ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సుధీర్ బాబు లైట్స్ సెట్ చేసే విలేజ్ కుర్రాడిగా కనిపించబోతున్నాడు. ఇక ఆ పాత్రకు తగ్గట్లుగా రియల్ లైఫ్ లో ప్రాంక్ వీడియో చేసి సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. మరి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











