MAA Elections : ప్రకాష్ రాజ్ కు పెరుగుతున్న మద్దతు.. మరో సీనియర్ హీరో పరోక్ష మద్దతు!

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను కల్పిస్తున్నాయి. తెలుగు సినిమా నటీనటులందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే ఒక పక్క ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా జీవిత రాజశేఖర్ కూడా పోటీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది, ఆమె ఇంకా మీడియా ముందుకు వచ్చి ప్రకటించలేదు.

ఇప్పటికే మా ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజు ఒక ప్రెస్ మీట్, నరేష్ ఒక ప్రెస్ మీట్ పెట్టి పరోక్షంగా కొందరిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయగా ఇప్పుడు తాను బరిలోకి దిగుతున్న అంటూ సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. అలా మొత్తం ఐదుగురు బరిలో ఉండగా అందరికంటే ఎక్కువగా ప్రకాష్ రాజ్ కు మద్దతు లభిస్తోంది. తాజాగా సీనియర్ నటుడు సుమన్ 'మా' ఎన్నికల వ్యవహారంపై ఆసక్తికరంగా స్పందించారు.

hero suman indirect support for prakash raj in MAA elections

మా ఎన్నికల గురించి మాట్లాడకుండానే అసలు లోకల్‌-నాన్‌లోకల్‌ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితమని చెప్పుకొచ్చారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమీర్‌పేటలోని అస్టర్‌ప్రైమ్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆ భావన వైద్యం అందించే వైద్యులకు, రైతులకు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అని ఆయన కోరారు. అలా సుమన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కు పరోక్షంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇక ఈ ఎన్నికల్లో చిరంజీవి మద్దతు ఎవరికి ఉంటే వారు గెలుస్తారన్న సంగతి తెల్సిందే. మరి ఆయన మద్దతు ఎవరికి ఇస్తారో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X