వైఎస్ జగన్ చేతుల మీదుగా హీరో సుమంత్ 'ఇదంజగత్' టీజర్!
హీరో సుమంత్ విభిన్న చిత్రాల వైపు దృష్టి పెట్టాడు. ఇటీవల సుమంత్ నటించి మళ్ళిరావా చిత్రం పరవాలేదనిపించింది. తాజాగా సుమంత్ రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి సుబ్రహ్మణ్యపురం కాగా మరొకటి ఇదంజగత్. అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ విడుదలకు ముహూర్తంకుదిరింది.
రేపే(ఆగష్టు 21) ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు. వైసిపి అధినేత వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ లాంచ్ కానుంది. చిత్ర యూనిట్ కొద్దిసేపటిక్రితమే ఈ విషయాన్ని ప్రకటించింది. జగన్, సుమంత్ చిన్ననాటి నుంచి స్నేహితులు. జగన్ రాజకీయాల్లో బిజీకాగా, సుమంత్ సినీ హీరోగా సెటిల్ అయ్యాడు. వైవిధ్యభరితమైన కథ, కథనాలతో ఈ చిత్రం రాబోతోంది.

సుమంత్ సరసన అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తోంది. సుమంత్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. మరోవైపు సుబ్రహ్మణ్య పురం చిత్ర ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











