Tollywood Drugs Case: ఈడీ విచారణలో హీరో తరుణ్.. అన్ని వైపుల నుంచి డోస్ పెంచిన అధికారులు!

కొనసాగుతున్న డ్రగ్స్ మరియు మనీలాండరింగ్ కేసులో టాలీవుడ్ నటుడు తరుణ్‌కు హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు వచ్చాడు. విచారణలో భాగంగా ఇదివరకే అతనికి ఈడీ సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరు కావాలని చెప్పడంతో తరుణ్ ఉదయం 10:30కి అధికారుల ముందుకు వచ్చాడు. తరుణ్ ఈడీ కార్యాలయానికి రాగానే ఒక్కసారిగా మీడియా ప్రతినిధులు ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మిదోయలో వైరల్ అవుతున్నాయి.

Recommended Video

తరుణ్ ఖాతా నుండి దారిమళ్లిన నిధులపైనే ఆరా..!!

ఎక్సైజ్ శాఖ అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి రావడంతో కేసు సరికొత్త యూ టర్న్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా గతంలో కంటే ఎక్కువ సమాచారం రాబట్టే ఛాన్స్ కూడా ఉందట. ఇక ప్రతిరోజూ ఒక్కొక్కరుగా సెలబ్రెటీలు ఈడీ విచారణకి హాజరవుతున్నారు. వారిని గంటల తరబడి విచారిస్తున్న ఆఫీసర్లు గతంలో జరిగిన బ్యాంక్ ఖాతా లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

లావాదేవీల విషయంలో

లావాదేవీల విషయంలో

నేడు విచారణకు హాజరైన తరుణ్ ఈడీ ఆఫీసులో కొన్ని కీలకమైన ప్రశ్నలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నటుడిని గతంలో 2017 లో ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసు విషయంలో అతని ఇన్వాల్మెంట్ ఎంతవరకు ఉందనే ఆరోపణలపై ఈడీ అధికారులు విచారణను జరుపుతున్నారు. అతని లావాదేవీల విషయంలో కూడా కొన్ని ప్రశ్నలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది

కెల్విన్ తో సంబంధాలు ?

కెల్విన్ తో సంబంధాలు ?

ఈ కేసులో ప్రధాన నిందితుడైన డ్రగ్స్ డీలర్ కెల్విన్ అనే వ్యక్తితో అతని సంబంధాన్ని గురించి ప్రశ్నించబోతున్నారు. తరుణ్ గతంలో క్లీన్ చిట్ పొందినప్పటికీ, మరిన్ని వివరాల కోసం నటుడి ఆర్ధికవ్యవస్థలు ఇప్పుడు పరిశీలించనున్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదురైనప్పుడు లావాదేవీలు ఏమైనా జరిగాయా లేదా డబ్బును వేరే రూపంలో కెల్విన్ అనే పర్సన్ కు ఇచ్చారా అనే సందేహాలపై కూడా అధికారులు తరుణ్ ను వివరణ కోరనున్నారు.

పూర్తి ఆధారాలతో

పూర్తి ఆధారాలతో

తరుణ్ కూడా పూర్తి ఆధారాలతో తన బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన పాత్రలను బ్యాంక్ ఎకౌంట్స్ వివరాలను ఈడీ అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ ప్రముఖులు పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, నందు, తనీష్ అల్లాడి మరియు నవదీప్ లను ED ఇప్పటికే ప్రశ్నించింది. అందరూ కూడా వారి బ్యాంక్ కు సంబంధించిన లావాదేవీల పూర్తి వివరాలను అధికారులకు అందించారు. ఇక వారితో ఎవరికైనా కెల్విన్ తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా అన్ని వైపుల నుంచి విచారణ జరిపారు.

విచారణ ఎంత సేపు?

విచారణ ఎంత సేపు?

విచారణ పూర్తయిన తర్వాత వారి ఆర్థిక వ్యవహారాలన్నింటినీ కోర్టుకు సమర్పించిన తర్వాత ED ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఇక అందరి సెలబ్రిటీల మాదిరిగానే, తరుణ్ రోజులో ఎక్కువ భాగం ED ఆఫీసులో ఉంటారని భావిస్తున్నారు. గతంలో పిలిచిన ప్రముఖులను అధికారులు రోజుకు 5-10 గంటల మధ్యలో గ్యాప్ లేకుండా ప్రశ్నించారు. ఇక తరుణ్ ను ఎంత సేపు విచారిస్తారో చూడాలి. ఇక ఈ కేసులో ఇప్పటివరకు సరైన క్లారిటీ రాకపోవడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X