Tarun on Marriage: మెగా ఇంటి అల్లుడిగా తరుణ్ అంటూ ప్రచారం... అసలు విషయం తెలిసిపోయిందిగా!
టాలీవుడ్ లో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి.. లవర్ బాయ్ ఇమేజ్ కొట్టేసిన తరుణ్.. చాలా మందికి గుర్తుండే ఉంటారు. తెలుగులో అనేక సినిమాలు చేసి... కొనాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా తరుణ్ పెళ్లంటూ ప్రచారం జరుగుతోంది. అది కూడా మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే....
బాలనటుడిగా ఎంట్రీ... :ఒకప్పుడు స్టార్ హీరోగా... లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో అనేక సినిమాలు చేశారు తరుణ్. 1990 నుంచి 1995 వరకు బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి.. అందరి మెప్పు పొందారు. ఇక బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాలో తరుణ్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇక స్టార్ హీరోల పక్కన బాల నటుడిగా నటించి అలరించిన తరుణ్.. 2000 సంవత్సరంలో నువ్వేకావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

లవర్ బాయ్ గా... :ఇక అక్కడి నుంచి మొదలైన తరుణ్ ప్రయాణం... లవ్ అంట్ ఎంటర్ టైనర్ సినిమాలు తీస్తు.. లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రియమైన నీకు, చిరుజల్లు, నువ్వులేక నేనులేను, నువ్వే కావాలి అంటూ.. ప్రేమకథ చిత్రాల్లో నటించి.. అమ్మాయిల రాకూమారుడిగా మారారు. ఇక ఆయన చివరి చిత్రం 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. చివరగా మలయాళం సినిమా అనుకోని అతిథిలో హీరోకు డబ్బింగ్ చెప్పారు.

అటు నాగబాబు కుమార్తెతో..:అయితే తరుణ్... ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అయితే తెలియదు కానీ... కొన్నాళ్లుగా ఆయన పెళ్లిపై రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల విడాకులు తీసుకున్న నిహారికతో పెళ్లి అంటూ వార్తలు కూడా వచ్చాయి. తరుణ్ ను నిహారిక చేసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇటు చిరు కుమార్తెతో...:అంతే కాదు.. మరోవైపు చిరు కుమార్తె శ్రీజతో తరుణ్ పెళ్లి అంటూ కూడా ప్రచారం సాగుతోంది. శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భర్తతో విడాకులు తర్వాత కల్యాణ్ దేవ్ తో శ్రీజ వివాహం జరిగింది. అయితే వీరికి పిల్లలు కూడా పుట్టారు. అయితే ఏమైందో తెలియదు వీరు కూడా విడాకులు తీసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే శ్రీజ మరోసారి పెళ్లి చేసుకోబుతున్నట్లు.. అది కూడా హీరో తరుణ్ తో అని వార్తలు గుప్పుమన్నాయి.

తరుణ్ క్లారిటీ... :తరుణ్ వివాహం ఫిక్సయిందంటూ... సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారం గురించి ఆయన మాట్లాడుతూ... వస్తున్న వార్తలో నిజం లేదు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతాను. తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదు.. అంటూ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











