హీరో విజయ్ దేవరకొండనా? శివకార్తీకేయనా? ముదిరిన టైటిల్ లొల్లి
సినిమా పరిశ్రమలో హీరో టైటిల్‌కు ఎప్పుడూ డిమాండే ఉంటుంది. జాకీ ష్రాఫ్ అయినా గానీ.. చిరంజీవి అయినా గానీ హీరో టైటిల్‌ను ప్రేక్షకులు ఆదరిస్తునే ఉంటారు. తాజాగా మళ్లీ హీరో టైటిల్ తెరపైకి వస్తున్నది. అయితే ఒకే సమయంలో ఇద్దరు కథానాయకులు ఒకే టైటిల్‌తో రావడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అందులో ఒకరు విజయ్ దేవరకొండ కాగా.. మరోకరు తమిళ హీరో శివకార్తికేయన్ కావడం గమనార్హం. అయితే ఈ ఇద్దరు హీరో టైటిల్‌తో ముందుకొస్తుండటంతో ఎవరు బాక్సాఫీస్ వద్ద హీరోగా మారుతారానేది ఆసక్తిగా మారింది.
తెలుగులో మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో అనే టైటిల్‌తో సినిమా రూపొందుతున్నది. అయితే 2017లో హీరో టైటిల్ తాను ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్టు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా టైటిల్ రిజిస్టర్‌కు సంబంధించిన రశీదును కూడా చూయించారు. అయితే ఈ ఇద్ధరు కథనాయకులు ఒకే టైటిల్‌తో రావడం కొంత గందరగోళానికి దారి తీస్తున్నది.

ఇక తమిళంలో కేజేఆర్ స్టూడియోస్ అనే సంస్థ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో హీరో టైటిల్‌ను ఖరారు చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. అశ్విన్, ఐశ్వర్య రాజేష్, గురు సోమసుందరం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
అభయ్ డియోల్‌ను ఈ సినిమాలోకి తీసుకోవడంపై మిత్రన్ స్పందిస్తూ.. రోల్‌కు ఉన్న ప్రాధాన్యతను బట్టే ఆర్టిస్టుల ఎంపిక ఉంటుంది. అందుకే బాలీవుడ్ నటుడిని తీసుకొన్నాను. దాదాపు 35 రోజుల షూటింగ్ చేశాం. ఇంకా కొంత పోర్షన్ షూట్ చేయాల్సి ఉంది అని మిత్రన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











