క్షణక్షణం డిఫరెంట్ మూవీ.. ప్రేక్షకులను మెప్పిస్తా...హీరో ఉదయ్ శంకర్

టాలీవుడ్‌లో విభిన్నమైన, విలక్షణతో కూడిన చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మంచి కథ, కథనాలతో వస్తున్న సినిమాలు సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ కోవలనే వస్తున్న కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం క్షణక్షణం. గతంలో ఆటగదరా శివ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్న యువ హీరో ఉదయ్ శంకర్ మరోసారి ఆడియెన్స్‌న తన నటనతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు.

క్షణక్షణం మూవీ రిలీజ్‌కు ముందే ఉదయ శంకర్ పెర్ఫార్మెన్స్‌ సినీ వర్గాల చర్చనీయాంశమైంది. సత్య పాత్రలో డిఫరెంట్ రోల్‌ను పోషించారనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకు లవర్ బాయ్, ఎమోషనల్ పాత్రలతో మెప్పించిన ఉదయ్ శంకర్ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు.

Hero Uday Shankar confident about Kshana Kshanam success

వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన క్షణక్షణం చిత్రంలో వైవిధ్యమైన పాత్రను పోషించిన ఉదయ్ శంకర్ ఫిబ్రవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Hero Uday Shankar confident about Kshana Kshanam success

ఉదయ శంకర్ కెరీర్ విషయానికి వస్తే.. సినిమాల్లోకి ప్రవేశించకముందే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. ఆటగదరా శివ, మిస్ మ్యాచ్ సినిమాతో ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు. ఇప్పుడు మూడో చిత్రంగా క్షణక్షణం చిత్రంలో నటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు చిత్రాల కంటే ఈ చిత్రంలో నా పాత్ర, నా నటన మరింత మెరుగ్గా, పరిణతితో కూడిన విధంగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు సినిమా చూసి కొత్త అనుభూతికి గురవుతారు అని ఉదయ శంకర్ అన్నారు. కమర్షియల్‌ హీరోగా తనకు మంచి పేరు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X