థ్రిల్లర్, లవ్ స్టోరితో ఉదయ్ శంకర్.. మేఘా ఆకాష్‌తో ‘అట్లూరి’ కొత్త మూవీ ప్రారంభం!
విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు చేరువవుతున్న యువ హీరో ఉదయ్ శంకర్. గత చిత్రాలతో టాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకొంటున్నారు. జయపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను అందిస్తున్నారు. ఆ క్రమంలోనే తన తాజా చిత్రాన్ని ఇటీవల హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని ఆలయంలో ప్రారంభించారు. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్‌పై డాక్టర్ సౌజన్య ఆర్ అట్లూరి సమర్పిస్తున్నారు. నిర్మాత అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉదయ్ శంకర్ తాజా చిత్రం ముహూర్తం షాట్‌కు ముఖ్య అతిథులుగా శ్రీరామ్ క్లాప్ కొట్టగా.. దినేష్ చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. హీరోగా నాకు ఇది ఐదో సినిమా. ఈ బ్యానర్ లో రెండో సినిమా. నిర్మాత నారాయణరావుగారితో మరోసారి ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓ రకంగా ఇది ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాంటిదే. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ తర్వాత మధునందన్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీలో కూడా మధునందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు మన్మోహన్ అద్భుతమైన స్క్రిప్ట్‌తో వచ్చాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది అని అన్నారు. ''
దర్శకుడు మన్మోహన్ మాట్లాడుతూ.. శ్రీరామ్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2 ముహూర్తం జరిగింది. దర్శకుడుగా ఇది నాకు ఫస్ట్ మూవీ. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నారాయణరావుగారికి, హీరో ఉదయ్ కి థ్యాంక్యూ. నా కెరీర్ మొత్తం నన్ను సపోర్ట్ చేస్తున్న నా సోదరులకు థ్యాంక్స్. ఈ మూవీ ఏప్రిల్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. ఇది ఫ్యామిలీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తోపాటు ప్రేమకథ కూడా మిళితమై ఉంటుంది అని అన్నారు.

నిర్మాత నారాయణరావు మాట్లాడుతూ.. శ్రీరామ్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా ఉదయ్‌తోనే స్టార్ట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా గురువు శ్రీరామ్ సార్‌కీ, నా మిత్రుడు దినేష్ చౌదరికీ, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఉదయ్ శంకర్‌తోపాటు హీరోయిన్ మేఘా ఆకాశ్ పాత్రలు చాలా బావుంటాయి. మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ జాంబిరెడ్డి ఫేమ్ అనిత్ కుమార్ అందిస్తున్నారు. మంచి కాస్ట్ అండ్ క్రూతో వస్తున్న ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
నటీ నటులు: ఉదయ్ శంకర్, మేఘా ఆకాశ్, మధునందన్, వెంకటేష్ కాకమాను, శశి తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫి: అనిత్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: షర్మేల యొలిశెట్టి
కాస్ట్యూమ్ డిజైనర్: జోష్యుల గాయత్రిదేవి
పిఆర్వో: జిఎస్కే మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సాయి కృష్ణ, వెంకీ, కిశోర్
నిర్మాత: అట్లూరి నారాయణరావు
రచన, దర్శకత్వం: మన్మోహన్ మేనంపల్లి


Click it and Unblock the Notifications











