ఉదయ్ కిరణ్, తరుణ్‌తో పోల్చద్దు.. నేనలా కాదంటూ వరుణ్ సందేశ్ కీలక వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది యువ హీరోలు మంచి స్థాయికి వెళ్లి ఆ తరువాత కొన్నాళ్ళకే కనుమరుగై పోతున్నారు. మొదట్లో సక్సెస్ లేని హీరోలు సినిమాలు చేయడం లేదంటే లక్కు బాలేదేమో అనుకోవచ్చు. కానీ సక్సెస్ ఫుల్ హీరోలుగా మారిన వాళ్ళు కూడా ఇప్పుడు మాయమవుతున్నారు. అలా ఉదయ్ కిరణ్, తరుణ్ కూడా ఒకప్పుడు స్టార్లుగా ఉండి ఆ తరువాత కనుమరుగు అయిన వారే. ఇక వారిలానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన వరుణ్ సందేశ్ అప్పట్లో ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

రెండవ సినిమా కొత్త బంగారులోకం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. యూత్ లో కూడా మంచి క్రేజ్ రావడంతో వరుణ్ సందేశ్ ఈజీగా క్లిక్కవుతాడు అని అనుకున్నారు. కానీ ఆ రెండు సినిమాల తరువాత అతని స్టోరీ సెలక్షన్ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. కొన్నేళ్ల క్రితం సంపత్ నంది దర్శకత్వంలో చేసిన ఏమైంది ఈ వేళ సినిమా కమర్షియల్ కొంత బాగానే ఆడినప్పటికీ వరుణ్ సందేశ్ ఫామ్ లోకి రాలేదు. దాదాపు వరుసగా 15 సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక పెళ్లి తరువాత వరుణ్ యూఎస్ వెళ్లి పోయాడు. సినిమా ఛాన్సులు వస్తేనే మళ్ళీ ఇండియాకు వస్తున్నాడు.

Hero Varun Sandesh intresting comments About Uday Kiran and Tarun

అయితే ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ యాంకర్ తరుణ్ ఉదయ్ భాస్కర్ కెరీర్ లతో వరుణ్సందేశ్ కెరీర్ని పోలుస్తూ మీ కెరియర్ కూడా వారిద్దరికీ అలాగే సాగుతోంది కదా అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ముందు అవును నిజమే అని ఒప్పుకున్న వరుణ్ సందేశ్ ఆ తరువాత మాత్రం ఎవరి కెరీర్ వాళ్ళదే అని చెప్పుకొచ్చారు. వాళ్ళ కెరీర్ లతో అలాగే వాళ్ళతో తన వద్ద ఉన్న ఆయన తాను ఇప్పటికీ పోరాడుతూనే ఉంటానని చెప్పుకొచ్చారు ఎప్పుడు కొత్త కథలు కొత్త సినిమాలు చేయాలని తాను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటానని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X