ట్యాక్సీ మూవీ యాక్షన్ థ్రిల్లర్.. విజయేంద్ర ప్రసాద్ వద్ద పనిచేస్తుంటే అలా ఆఫర్? యువ హీరో వసంత్ సమీర్ (ఇంటర్వ్
టాలీవుడ్‌కు మరో యువ నటుడు వసంత్ సమీర్ టాక్సీ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నారు. నటుడిగానే కాకుండా కథా రచయితగా, ఇతర రంగాల్లో తన ప్రతిభాపాటవాలతో రాణిస్తున్నారు. బాహుబలితో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన రచయిత విజయేంద్ర ప్రసాద్ వద్ద శిష్యరికం చేసిన వసంత్.. టాక్సీ సినిమా ద్వారా నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టాక్సీ సినిమా మార్చి 10వ తేదీన రిలీజ్ అవుతున్న సందర్భంగా వసంత్ సమీర్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

విజయేంద్ర ప్రసాద్ సపోర్టుతో
నేను పుట్టినది వైజాగ్. మా నాన్న గారి పేరు చైతన్య. విజయేంద్ర ప్రసాద్ వద్ద మా నాన్నగారు సహాయకుడిగా పనిచేస్తారు. నేను చిన్నతనంలోనే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాం. నేను మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన తర్వాత నేను యాక్టర్ కావాలనుకొన్నాను. అయితే నా తొలి సినిమా ఆగిపోవడంతో ఏం చేయాలో తోచలేదు. దాంతో విజయేంద్ర ప్రసాద్ గారు అవకాశం ఇస్తే ఆయన టీమ్‌లో చేరాను అని యువ నటుడు వసంత్ సమీర్ చెప్పాడు.

నిహారిక కొణిదెలతో వెబ్ సిరీస్
విజయేంద్ర ప్రసాద్ వద్ద పనిచేస్తూనే యాక్టింగ్ ట్రయల్స్ కూడా చేశాను. అలా ఆడిషెన్స్‌కు వెళ్తుండగా వచ్చిన ఆఫర్ కర్త, కర్మ క్రియ. ఆ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు నిర్మాత. నాగు గవర దర్శకత్వం వహించారు. అలా నేను మొదటి సినిమా చేశాను. ఆ సినిమా తర్వాత టాక్సీ సినిమా చేయడానికి రెడీ అయ్యాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడం, షూటింగ్ ప్రారంభించిన సమయంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ బ్రేక్‌లో షూట్ పూర్తి చేశాం. కోవిడ్ సమయంలోనే నిహారిక కొణిదెల వెబ్ సిరీస్‌లో నటించాను. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ అవుతుంది అని వసంత్ సమీర్ తెలిపాడు.

అర్జున ఫాల్గుణ సినిమాకు రైటర్‌గా
నటుడిగా సినిమా చేస్తూనే రైటింగ్ సైడ్ కూడా వర్క్ చేశాను. శ్రీ విష్ణు నటించిన అర్జున ఫాల్గుణకు సినిమాకు రైటర్‌గా పనిచేశాను. అలాగే దసరా సినిమా తర్వాత నాని నటించే సినిమాకు నేను రైటర్‌గా పనిచేశాను. నా ఫ్రెండ్స్‌లో ఒకరు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఓ సినిమా, వెబ్ సిరీస్‌లో నటించబోతున్నాను అని వసంత్ సమీర్ చెప్పాడు.

టాక్సీ సినిమా కథ ఏమిటంటే?
టాక్సీ సినిమా విషయానికి వస్తే.. ఉబర్ పూల్‌లో నలుగురు ప్రయాణించే సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంగా కథ సాగుతుంది. ఉబర్ పుల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నలుగురి మధ్య ఏం జరిగింది. ఆ నలుగురి మధ్య ఎలాంటి విషయం సమస్యగా మారిందనేది కథ. మెటల్‌ను దొంగిలించడానికి చేసిన ప్రయత్నాన్ని నేను ఎలా ఆపాను అనే విషయం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నేను ఈశ్వర్ అనే పాత్రలో నటించాను. త్రివిక్రమ్ వద్ద అజ్ఞాతవాసి వద్ద పనిచేసిన హరీష్ సజ్జా దర్శకత్వం వహించారు.

మ్యూజిక్, యాక్షన్ ఎపిసోడ్స్ క్రేజీగా
ట్యాక్సీ సినిమా బ్యాక్ అండ్ ఫోర్త్‌గా సాగే కథలో ట్విస్టులు, టర్న్‌లతో యాక్షన్ డ్రామాగా సాగుతుంది. మార్ రాబిన్ మ్యూజిక్ అందించారు. బీజీఎం చాలా అద్బుతంగా ఉండటమే కాకుండా సన్నివేశాలను చాలా హైలెట్ చేస్తుంది. ఈ సినిమాలో ఒకటే పాట ఉంటుంది. ఆ పాటను సిద్ శ్రీరాం పాడారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని వసంత్ సమీర్ తెలిపాడు. నాకు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యత ఉండటంతో శ్రీధర్ మాస్టర్ నాతో ఎక్కువగా యాక్షన్ సీన్లు చేయించారు. క్వాలిటీ కోసం ఫాంటమ్ కెమెరాను ఉపయోగించి మంచి అనుభూతిని పంచే యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











