For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో బిజినెస్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ... మంత్రి కేటీఆర్‌తో కలిసి...

    |

    టాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ బిజినెస్ లో కూడా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రౌడి క్లబ్ తో సరికొత్తగా ఫ్యాషన్ బ్రాండ్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవైేట్ లిమిటెడ్ అనే హైదరాబాద్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు.

    శుక్రవారం ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్ లో ఈ కంపెనీ తన బిజినెస్ ప్లాన్ ను లాంఛ్ చేసింది. విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ కంపెనీజి నిర్వాహకులుగా కొనసాగుతున్నారు. వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఉపయోగాలు ఏమిటంటే.. ఎలక్ట్రిక్ బైక్స్ , స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు.

    Hero Vijay Devarakonda as a partner in Watts and Volts Company

    పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రానికి స్కూటర్లు, బైక్ లతో కాలుష్యం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ప్రయాణించే దూరానికి తగినంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇక గమ్యాలకు వేగంగా చేరడమే కాకుండా సమయం, డబ్బూ ఆదా అవుతాయని విజయ్ దేవరకొండ తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని అంటున్నారు.

    Hero Vijay Devarakonda as a partner in Watts and Volts Company

    భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు. అందుకే వాట్స్ అండ్ వోల్ట్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు చెబుతూ.. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని అన్నారు.

    English summary
    Tollywood star hero Vijay Devarakonda has joined another new business partner. Invested in Hyderabad-based Watts & Volts Mobility Pvt Ltd. The company is managed by Vijay Madduri, Kedar Selagansetti and Vamsi Karumanchi. The company launched its business plan at the Electric Vehicle Summit chaired by IT Minister KTR in the city on Friday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X