విజయ్ దేవరకొండ హోలీ సంబురాలు.. కొత్త హీరోయిన్‌తో స్టెప్పులు.. మరో సర్‌ప్రైజ్ ఏంటంటే?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదిరిపోయే సినిమాలతో వస్తూ అందరినీ మెప్పించే ఈయన తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. అయితే హోలీ సందర్భంగా ఈయన స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ముఖ్యంగా ఓ కొత్త హీరోయిన్ తో హోలీ సంబురాలు చేసుకుని.. అదిరిపోయే పాటకు స్టెప్పులు వేశారు. అది మాత్రమే కాకుండా మరో బహుమతి కూడా ఇచ్చారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్. అయితే ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై.. దిల్ రాజు, వాసువర్మ, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, టీజర్లు, పాటలు విడుదల కాగా పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి.

Hero Vijay Devarakonda Holi Celebrations With new heroine Check Details

ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబధించిన రెండు సర్ ప్రైజ్ లు ఇచ్చారు హీరో విజయ్. ముఖ్యంగా హోలీ పండుగ సందర్భంగా.. హీరోయిన్ తో కలిసి వేడుకలు చేసుకున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు... ఫ్యామిలీ స్టార్ మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అయితే ఈ వేడుకల్లో వీరిద్దరు మాత్రమే కాకుండా మూటీ టీం కూడా పాల్గొంది. వైట్ అంట్ వైట్ డ్రెస్ లో వచ్చిన అందరూ రంగులు పూసుకుంటూ.. ఎంజాయ్ చేయగా.. మృణాల్, విజయ్ లు కలిసి ఓ పాటకు స్టెప్పులు వేశారు.

ఇందులో మృణాల్, విజయ్ దేవరకొండలు చాలా అందంగా కనిపించడమే కాకుండా.. అంతకు మించిన గ్రేస్ తో డ్యాన్స్ చేశారు. ఫ్యామిలీ స్టార్ చిత్రబృందం చేసుకున్న హోలీ సంబురాల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది మాత్రమే కాకుండా ఈ సినిమా నుంచి మరో అద్భుతమైన మెలోడీ పాటను విడుదల చేశారు. ఇప్పటికే రెండు రిలీజ్ కాగా.. తాజాగా మరో సాంగ్ వచ్చింది.

Hero Vijay Devarakonda Holi Celebrations With new heroine Check Details

అద్భుతమైన మెలోడీ పాటను హోలీ స్పెషల్ సర్ ప్రైజ్ కింద రిలీజ్ చేయగా.. ఈ సాంగ్ వైరల్ అవుతోంది. మధురము కదా ప్రతొక నడక నీతో కలిసేలా అంటూ సాగే ఈ పాటను ప్రముఖ సింగర్ శ్రేయ్ ఘోషల్ పాడింది. అద్భుతమైన గాత్రం అంతకు మించిన మ్యూజిక్ తో ఈ పాట మ్యాజిక్ చేస్తోంది. అయితే ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకోనుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X