సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ సూపర్ స్టార్ విజయ్. ప్రగతి భవన్‌లో భేటి వెనుక కారణం ఏమిటంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ భేటీ కావడం రాజకీయ, సినీ వర్గాల్లో భారీగా చర్చకు దారి తీసింది. మీడియాకు సమాచారం లేకుండా నేరుగా సినీ హీరో విజయ్ ప్రగతి భవన్‌లో ప్రత్యక్షం కావడం సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. విజయ్‌ను ప్రగతి భవన్ అధికారులు అధికారికంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌తో దాదాపు 10 నిమిషాలకుపైగానే భేటి అయ్యినట్టు సమాచారం.

ప్రగతి భవన్‌కు వచ్చిన విజయ్‌ను కేసీఆర్ ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఆయనకు వీణ రూపంలో ఉన్న గిఫ్టును బహుకరించారు. కేసీఆర్‌కు విజయ్ పుష్పగుచ్ఛం ఇచ్చి కలిశారు. ఈ సందర్భంగా మీడియా కోసం ఫోటో ఇస్తూ ఇద్దరు చిరునవ్వు చిందిస్తూ కనిపించారు.

 Hero Vijay met CM KCR at Pragathi Bhavan in Hyderabad

సీఎం కేసీఆర్‌తో విజయ్ భేటి మర్యాదపూర్వకంగానే జరిగింది అని అధికారిక వర్గాలు వెల్లడించారు. విజయ్‌ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ స్వయంగా సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లడం విశేషంగా మారింది.

 Hero Vijay met CM KCR at Pragathi Bhavan in Hyderabad

తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణలో బీస్ట్ సినిమాకు టికెట్ రేట్లు పెంచినందుకు సహకరించినందుకు సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినట్టు తెలిసింది.

 Hero Vijay met CM KCR at Pragathi Bhavan in Hyderabad

ఇదిలా ఉండగా, కేసీఆర్, విజయ్ భేటి వెనుక రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. గత కొద్దికాలంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి కోణం ఏమైనా ఉండొచ్చు అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X