గ్యాంగ్‌తో వెళ్లి ఆ స్టార్ డైరెక్టర్‌ను బెదిరించిన హీరో విశ్వక్ సేన్.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనను కనబర్చి.. అంతకు మించిన సూపర్ స్టోరీస్ తో ప్రేక్షకులు ముందుకు వస్తుంటాడీ కుర్రహీరో. వెళ్లిపోమాకే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన గామితో సూపర్ సక్సెస్ సాధించాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తాను కెరియర్ తొలి నాళ్లలో ఓ స్టార్ డైరెక్టర్ ను బెదిరించినట్లు చెప్పాడు. ముఖ్యంగా గ్యాంగ్ ను వెంట పెట్టుకుని వెళ్లి మరీ ఓ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పాడు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా వెళ్లిపోమాకే సినిమా తీసిన విశ్వక్ సేన్.. ఆ తర్వాత తన డైరెక్షన్ లోనే మరో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. ఫలక్ నుమా దాస్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాడు. అయితే అప్పుడు పెల్లి చూపులు అనే సినిమా విడుదల కావడం... ఆ సినిమా హీరో విశ్వక్ సేన్ కు బాగా నచ్చడంతో స్నేహితలను వెంట తీసుకు వెళ్లి మరీ సినిమా చూపించాడట. ముందుగా ఆ సినిమాకు వెళ్లడం వద్దని చెప్పిన తన ఫ్రెండ్సే.. చూశాక సినిమా చాలా బాగుందని అన్నారట.

Hero Vishwak Sen Went With The Gang And Threatened The Star Director Check Details

అయితే ఆ సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి తనకు తెలుసు అని గతంలో కూడా ఆయన సైన్మా అని చేసిన ఓ సినిమా చాలా నచ్చిందని... అందుకే పెళ్లి చూపులకు తీసుకు వెళ్లినట్లు స్నేహితులతో చెప్పాడట. అయితే ఆరోజు సాయంత్రమే తనకు ఓ పబ్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కనిపించాడట. వెంటనే తన స్నేహితులను వెంట వేసుకుని వెళ్లి మరీ ఆ డైరెక్టర్ తో మాట్లాడారట. నేను సినిమాలు చేయాలనుకుంటున్నాను.. మీ సినిమా బాగుంది... మీరు చేసే ఏదైనా సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వండని అడిగాడట.

అంతేకాకుండా తాను హీరోగానే కాదు.. సైడ్ ఆర్టిస్ట్ గా చేయడానికి అయినా రెడీయేనని అన్నారట. చాలా కోపంగా.. వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడుతూ.. ఆయనను బెదిరించి మరీ ఫోన్ నెంబర్ తీసుకున్నారట. భయంతో తురణ్ భాస్కర్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వగా ఆరోజు వెళ్లిపోయారట. ఆ తర్వాత రోజు ఉదయమే రాత్రి తాను ఎవరితోనే రాష్ గా బిహేవ్ చేసినట్లు అనిపించి పొద్దునే ఫోన్ చేసి సారీ చెప్పాడట. బలవంతంగా ఫోన్ నెంబర్ తీసుకున్నాను... ఇంకెప్పుడూ ఫోన్ చేయనని కూడా చెప్పారట.

ఆ తర్వాత ఆయనే నేరుగా ఫోన్ చేసి ఈ నగరానికి ఏమైంది అనే ఓ సినిమా చేస్తున్నాను.. దాస్ కా ధమ్కీ ఆపుకుని ఇది చేయగలవా అని అడగ్గా... విశ్వక్ సేన్ ఓకే చెప్పాడట. అలా తీసిన సినిమానే ఈ నగరానికి ఏమైందని.. తాజాగా ఆయన పాల్గొన్న మంచు మనోజ్ ఉత్సాద్ షోలో వెల్లడించాడు. తాను ఒక్క ఒక్క సారి చేసిన మిస్టేక్ ఇదేనని.. ఆ తర్వాత ఎవరితోనూ ఇలా బిహేవ్ చేయలేదని కూడా క్లారిటీ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X