Ramayanam బాలీవుడ్ రామాయణం మూవీకి నిర్మాతగా యష్.. రావణాసురుడిగా పార్ట్‌నర్‌షిప్!
హిందీ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 5000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాయాయణ ఇతిహాసంకు సంబంధించిన ఓ సినిమా రూపొందించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అద్భుతమైన కాన్సెప్ట్ తో అందరినీ మెప్పించేందుకు రాబోతున్న ఈ సినిమాలో స్టార్ నటీనటులు ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కేజీఎఫ్ హీరో ఈ సినిమా రావణుడి పాత్రలో కనిపించడం మాత్రమే కాకుండా.. అంతకు మించి ఈయన ప్రేమేయం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ రామాయణం సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు. అంటే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు, ఎవరెవరు భాగస్వాములు కాబోతున్నారే దానిపై పూర్తి క్లారిటీ రాలేదు. ఇప్పటికీ నటీనటుల విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే న్యూస్ వెలుగులోకి వచ్చింది.

రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించబోతున్న ఈ సినిమాలో రావణాసురుడిగా కేజీఎఫ్ హీరో యశ్ ను తీసుకున్నట్లు సమాచారం. అయితే టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో శూర్పణక పాత్రలో కనిపించనున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. అయితే తాజాగా యశ్.. ఈ సినిమాలో రావణాసురిడి పాత్రలో మాత్రమే కనిపించకుండా.. మరో బాధ్యతను కూడా తీసుకున్నారట. భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న ఈ సినిమాకు యశ్.. సహ నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నారట.
ఇదే విషయమై యశ్.. చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాతో పాటు చిత్రబృందంతో కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఇదే విషయంలో యశ్ కూడా స్పందించారు. అదిరిపోయే అద్భుతమైన సినిమాలు తెరకెక్కించాలనే ఉద్దేశంతోనే మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ ప్రారంభించిన తాను.. నమిత్ మల్హోత్రాతో కలిసినట్లు చెప్పుకొచ్చారు. ఆయనను కలిసి మాట్లాడిన తాను చిత్ర పరిశ్రమకు సంబంధించిన అనేక విషయాలు చర్చించుకున్నట్లు చెప్పారు. అలాగే బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రాబోతున్న రామాయణం సినిమాకు తాను సహ నిర్మాతగా పని చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చెప్పారు.

ఇదంతా ఇలా ఉండగా... రామాయణ ఇతిహాసాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే పార్ట్ 1ను 2025 దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తుందట. మరి ఎప్పుడు ఈ చిత్రం పట్టాలెక్కుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











