RGV బలమైన మగాళ్లు నాకు ఇష్టం.. అందమైన అమ్మాయిలంటే.. ఆర్జీవి కామెంట్స్ వైరల్!

సెటైర్లు, హాట్ కామెంట్స్ చేస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఆయన తనకు నచ్చినట్టుగా ఎలాంటి మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడటం చేస్తుంటాడు. తాజాగా ఆర్జీవి తలకొన అనే సినిమా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడమే కాకుండా హీరోయిన్ అప్సరరాణిపై ప్రశంసలు కురిపిస్తూ ఏం మాట్లాడినారంటే.

సినిమా ఇండస్ట్రీలో నా ఎంట్రీ 1985లో జరిగింది. 1988 సంవత్సరంలో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు శివ. రాము పేరులో ఒక వైబ్రేషన్ ఉంది. ఆయన తీసిన సినిమాలు ఆయన కూడా చూసి ఉండరు. రాము తీసిన సినిమాలో నాకు నచ్చిన మూవీ క్షణక్షణం. ఇప్పటికీ నేను ఆ సినిమా గురించే చెబుతుంటాను అని శివాజీ రాజా చెప్పారు.

 Heroine Apsara Rani get huge applause from Ram Gopal Varma at Talakona Event

క్షణక్షణం సినిమాలో శ్రీదేవీ అందంగా కనిపించారు. ఆ తర్వాత ఏ సినిమాలోను శ్రీదేవి అంత అందంగా కనిపించలేదు. రాము కంటే నేనే సీనియర్. ఆయన తీసినట్టుగా అద్బుతంగా సినిమాలు ఎవరు తీయలేదు. ఆయన చెత్త సినిమాలు తీయలేదు అని శివాజీ రాజా చిన్న కౌంటర్ ఇచ్చారు.

తలకోన టైటిల్ ఉండటంతో అందరూ జంతువుల్లా అరుస్తున్నారు. బలమైన మగాళ్లు.. అందమైన అమ్మాయిలంటే నాకు ఇష్టం. బలమైన మగాళ్లంటే యాక్షన్ సినిమాలకు సంబంధించింది. ఇక బలమైన వ్యక్తిగా, అందమైన అమ్మాయిగా అప్సర రాణి నటిస్తున్నది. అందమైన అమ్మాయి కూడా అప్సరే.ఈ రెండు కాంబినేషన్స్ నాకు నచ్చాయి అని రాంగోపాల్ వర్మ చెప్పారు.

 Heroine Apsara Rani get huge applause from Ram Gopal Varma at Talakona Event

నాకు ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం. యాక్షన్, గ్లామర్, ఫారెస్ట్ ఈ మూడు అంశాలు తలకోన సినిమాలో కనిపించాయి.మంచి యాక్షన్ సినిమా అవుతుందని అనుకొంటున్నాను. ఆ విష్ ప్రొడ్యూసర్, దర్శకులకు, అప్సరరాణికి మంచి విజయం లభించాలని కోరుకొంటున్నాను అని ఆర్జీవి అన్నారు.

ఇక సినిమా పరిశ్రమలో అందరికీ ఓ అపోహా ఉంటుంది. నేను మంచి సినిమాలు తీయడానికి రాలేదు. చెడ్డ సినిమాలే చేయడానికి వచ్చాను. దురదృష్టం కొద్ది అని మంచి సినిమాలే అయ్యాయి. దానినే డెస్టీనీ అంటారేమో అని రాము తనదైన శైలిలో శివాజీ రాజాకు కౌంటర్ ఇచ్చారు. రాము ఇచ్చిన పంచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X