War 2: వార్ 2.. జూనియర్ ఎన్టీఆర్‌కు కత్తిలాంటి హీరోయిన్.. ఎవరో తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరి హృదయాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాధించుకున్న ఈయన టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. తాతకు తగ్గ మనవడిగా అనేక బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ ను ఎప్పటికప్పుడు పెంచుకుంటున్నాడు. అయితే చివరగా వచ్చిన ఆర్ఆర్ఆర్ ఎంత పెద్ద హిట్టు అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు.

అలనాటి అందాల తార శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెడుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్టు కావాలని యంగ్ టైగర్ చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా రిలీజ్ కాకముందే జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన తర్వాతి సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఎప్పుడో చెప్పేశారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఆయన వార్ 2 చిత్రంలో నటించబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు.

Heroine Confirm For Junior NTR in War 2 Movie Check Details

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. వార్ 2 చిత్రంలో నెగిటివ్ షేడ్స్ కల్గి ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా హీరోయిన్ ఉంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు హీరోయిన్ ఉందా, లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కు హీరోయిన్ ఫిక్స్ అని తెలుస్తోంది. అంతేకాదండోయ్ ఇప్పటికే ఈ పాత్రకోసం ఓ హీరోయిన్ ను కూడా సెలెక్ట్ చేశారు. వార్ 2 చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కు సరిపోయేలా ఉండే క్యూట్ హీరోయిన్ ను చిత్రబృందం రంగంలోకి దించుకోంది.

Heroine Confirm For Junior NTR in War 2 Movie Check Details

ఆమె మరెవరో కాదు... శార్వరి వాఘ్. బాలీవుడ్ లో బంటీ ఔర్ బబ్లీ 2 సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈమె.. కెరియర్ ప్రారంభంలో సహాయ దర్శకురాలిగా పని చేసింది. టాప్ డైరక్టర్లు అయిన లవ్ రంజన్, సంజయ్ లీలా భన్సాలీ వద్ద చాలా కాలం పాుటు పని చేసింది. అయితే హీరోయిన్ గా చేసిన తన మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా అందుకుంది. ఇలాంటి క్యూట్ బ్యూటీకి ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశం వచ్చిందంటే ఆమెకు ఇది గోల్డెన్ ఛాన్సే. అయితే వార్ 2 లో ఈమెను ఫిక్స్ చేసుకున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.

Heroine Confirm For Junior NTR in War 2 Movie Check Details

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్న వార్ 2 సినిమాను... యశ్ రాజ్ ఫిల్మ్స్ పై ఆదిత్య చోప్రా నిర్మించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ల కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Heroine Confirm For Junior NTR in War 2 Movie Check Details

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X